పుట:Geetanjali (Telugu).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
30

గీతాంజలి.

జనక ! నాదేశజనులు ద ♦ త్స్వర్గమునకు
మేలుకొందురు గాక ! నీ ♦ మూలకముగ

36


భావమున బాదుకొన్నట్టి ♦ పాపములను
మూలవిచ్చేదముగ గొట్టి ♦ మొదమిడుము.
ప్రభువతంనమ ! యిదియ నా ♦ ప్రార్ధనమ్మ,
లీల సుఖదు:ఖముల నోర్వ నా ♦ జాలునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.
బీదసాదల నెన్నడు వీడనట్టు
లోర్చి గర్వాంధునకు నొగ్గ ♦ కుండునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.
తుచ్చసంసారవిషయాళి ♦ దూలకుండ
మనసు ఘనమార్గమున బెట్టి ♦ మనెడునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పజలము.
స్వామి ! సంపూర్ణమైనట్టి ♦ ప్రేమతోడ
బలము నర్పించి నీయిచ్చ ♦ సలుపునట్లు
కూర్మితో దయసేయుము ♦ గొప్పబలము.

37


శక్తి తుద ముట్టె; నాయాత్ర ♦ సాగ దింక