పుట:Geetanjali (Telugu).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

జగము నాగెల్వగూడని ♦ శక్తి కొగ్గు;
నేను నిరుపద్రవస్వేచ్చ ♦ నెగడుచుందు;
నంచు రాత్రింబగళ్లు నే ♦ నగ్నికడను
గష్టపడి కాచి కఠినంబు ♦ గాగ గొట్టి
చేసితిని దీని నెంతయు ♦ సిద్ధముగను;
గొలుకులన్నియుదృఢముగా ♦ గూర్చ బడియె
గాని చిక్కించుకొని నన్నె ♦ కరము నొక్కె."

32


ఈజగతిలోన బ్రేమించు ♦ హితులు నన్ను
బట్టి బంధింతు రెంతయు ♦ భద్రముగను.
స్వేచ్చ న న్నుంచునట్టినీ ♦ ప్రేమ మరయ
నంత కధికంబు వేరు నై ♦ యలరుచుండు.
మఱతు వారిని నే నంచు ♦ వెఱచి నన్ను
నొక్కపుడుగూడ నొంటిగా ♦ నుండనీరు.
ఎన్నిదినములు గడచిన ♦ నేమి చెపుదు
నొక్కమా ఱైన గనపడ ♦ కుందు నీవు.,
ఎలమి నాప్రార్ధనల నిన్ను ♦ బిలువ కున్న
బ్రీతితో నిన్ను హృదయన ♦ బెట్ట కున్న
వేచు నీప్రేమ మెపుడు నా ♦ ప్రేమకొఱకె.