పుట:Geetanjali (Telugu).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

గీతాంజలి.

గాని నీవేలొకో దాగి ♦ కానరావు.
తఱచుగా నాదుకోర్కెల ♦ దలగద్రోసి
చపలదుర్బలవాంచచే ♦ సంభవించు
నాపదలనుండి రక్షించి ♦ యధిప! నన్ను
బూర్ణవిశ్వాసపాత్రుగా ♦ బొదలజేసి
నెమ్మితో నన్ను గరము మ ♦ న్నించినావు.

15


నిన్గుఱించిన గీతముల్ ♦ నేర్చి పాడ
నిచట నున్నాడ జగముల ♦ నేలుఱేడ!
భవ్యతర మగునీదివ్య ♦ భవనమందు
మూల నొకచోటు నాకును ♦ బొలుచుచుండు.
ఇజ్జగంబున నాకు బ ♦ నేమి లేదు,
విఫలమై యుండునాదుజీ ♦ వితము గాన
నిర్విషయగీతములె పాడ ♦ నేర్చియుండు,
మౌనముగ నిన్ను బరమేశ! మధ్యరాత్రి
యనెడునయ్యంధకారాల ♦ యంబునందు
బూజ సల్పుటకయి గంట ♦ మ్రోగునపుడు
నీయెదుట నిల్చి పాడగా ♦ నెమ్మితోడ
నాకు నాజ్ఞనొసంగు మ ♦ నాధనాధ!
భాసురంబుగ నొప్పుప్ర ♦ భాతమందు