పుట:Geetanjali (Telugu).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

ర్ధులకే కాక పండితులకు సయితము లోకజ్ఞానము లెస్సగ గలుగుపొంటె రచియించిన రఘువంశ మహాకావ్యము. కావ్యములలో మేలుబంతి యనదగి యున్నది. చిరకాలమునుండి నేటిదనుక సంస్కృత విద్య నభ్యసింపగోరువారికెల్ల కడు పుస్తకరూపమున నుండెడిగురువు. ప్రప్రధమమున గాళిదాసే యగున న్నాడన నాతనిని గాని యమ్మహాకవికి దాదృశ మైన చిరయశస్సు సంపాదించుచుండుప్రధమకావ్య మగు రఘువంశమునుగాని యేమని పొగడ గలము?

  అట్టి యా మూల్యకావ్యమున్ సంపూర్ణముగ దెలిగించి యాంధ్రలోకమునకు మీరు మహోపకార మొనరించి యున్నారు. ఏతాదృశమహాకార్యము నింకను మీరు చేయునట్లు సకలజగత్కర్త యగు పరమేశ్వరుడు మీకు నాయురారోగ్యానందంబుల నొసగుగావుత మని ప్రార్దించు దున్నాడను.
  ఈ గ్రంధమునందలి మీపద్యముల శైలిముగుల ధారాళముగను,మృదువుగను, రసవంతముగ్ను, మనోహరముగను నున్నది. మఱిల్యు సంస్కృతమున శ్లోకములెట్లు మృధుమధురముగ నున్నవో తెలుగున మీపద్యములును అట్లున్నవి. ఆంధ్రీకరణము కడవఱకు మూలమున కన్యూనానతి రిక్తముగ నొప్పారు చున్నది. పూర్వ మీరఘువంశమును దెనిగించిన "అవుడూరి పిచ్చయ్య" కవి యాంధీకరణమునకంటె  మీ యాంధ్రీకరణము వేవిధముల మిన్నగ నున్నది. మఱియు సంస్కృతమున నిండుకవిత  జ్ఞానం గలవారుసైతము మీపద్యముల సాహాయ్యమున "గాళిదాస" మహాకవియొక్క సంపూర్ణాభిప్రాయము లను బాగుగ గ్రహింప గలరనియు, సంస్కృతకావ్య ములలో నెట్టిమహిమ మున్నదో తెలిసికొనగు రనియు నేను దలంచెదను వేయేల? తనకవితా సామర్ధ్యము నెల్లను ఆధ్రలోకమునకు వెల్లడి చేయు తలంపున "గాళిదాస" మహాకవియే తనమహిమన మీయందు బ్రవేశపెట్టి మీచే నీయాంధ్రీకరణమును జేయించె నేమోయని యూహించు చున్నాడను.
పిఠాపురము, 28-8-13

చిత్తగింపుడు, ఇట్లుమిత్రము, నడకుదుటి వీరరాజు