పుట:Geetanjali (Telugu).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

గొనకు మెనరమైనను ♦ గొనకు కొనకు,
శుద్ధప్రేమాస్పదుండైన ♦ శుభుం డొసంగు
దానినే స్వీకరింపుము ♦ ధన్యు డగుము.

10


బీద సాదల పతితుల ♦ విడుదులందె
నీదుపాదారవిందముల్ ♦ నిలిచి యుండు;
గాన నచ్చట నెప్పుడుం ♦గ్రాలుచుండు
నీదుపదపీఠ మెంతయు ♦ నిశ్చలముగ.
బీద సాదల పతితుల ♦ విడుదులందు
నిలిచి యుండెను నీపాద ♦ నీరజములు
నీకు మ్రొక్కంగ భక్తి య ♦ త్నించునాకు
నందరానంతలోతున ♦ నలరు దేవ!
బీద సాదల పతితుల ♦ వెంటవెంట
గంతబొంతల దాలిచి ♦ కరుణతోడ
నరుగుచుండెడునట్టి యో ♦ పరమపురుష !
గరున మెపుడైన్మ నీకడ ♦ కరుగ గలదె?
నఖులు లేనట్టివారికి ♦ సఖుడ నగుచు
బీద సాదల పతితుల ♦ వెంటవెంట
నుండి ప్రేమాస్వరూపివై ♦ యొప్పునిన్ను
జేరగారాద్ నాధ ! నా ♦ చిత్త మెపుడు.