పుట:Geetanjali (Telugu).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

స్తే దాయచరిత్రము మున్నగ్రంధములు వ్రాసి పేరుపడిన మీయాంధ్రము వేఱ పొగడ నక్కఱ లేదు.

పిఠాపురము.

చిత్తగించవలెను. రామకృష్ణకవులు.

                   ------

VI.

బ్రంహశ్రీ వావిలికొలను సుబ్బారావుగారు.
  తమరు రచియించిన ఆంధ్రరఘువంశం కొంతకొంత చూచితిని. మూలమునకు సరిగాను ఇంపుగాను చక్కగా నున్నది.శైలి సరళమై యున్నది.
   మీయట్టివారు వ్రాసినదానియం దెట్టిలోటుండ గలదు. ఆంధ్రగ్రంధముమాత్రము ప్రత్యేకముగ ముద్రిం చినయెడల బాఠశాలలయందు జదువు బాలురకు వినియోగించ వచ్చునని  తోఛెడి. ఆలస్యము క్షమింపుడు.
తిరునవిక్కేణి. 31-8-13

ఇట్లువిన్నవించుభవద్విధేయుడు,

వా. సుబ్బారావు.

                  ----

VII.

బ్రహ్మశ్రీ జనకుదుటి వీరరాజుగారు.

  మీరు దయాపూర్వగముగ పంపిన "ఆంధ్రరఘు వంశపద్యకావ్యము" ను గని యమితానంద భరితుండ నయితిని. మహాకతి "కాళిదాసు" ఆంగ్లేయ కవిపుంగవుడగు "షేక్స్పియరు" నకు సమాను డనికొందఱును, అనేకవిధముల నాతనికంటె నెక్కువవా డనికొందఱు జెప్పుదురు పృధివియందు మానాధికరహితు డగునని యీతడొ కడే యనుట యనేకులయభిప్రాయముగ యున్నది. అట్టివిఖ్యాతి గాంచినకవి శ్రేష్టుడు గీర్వాణ భాషయందు విద్యా