పుట:Geetanjali (Telugu).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

కవిసార్వభౌము డగుకాలిదాసురఘువంశము దెనిగించి మీరాంధ్రలోకమునకు మహోపకార మొనర్చిరి. సంస్కృతకావ్యములలో వాల్మీమి రామాయణము. కాళిదాసరఘువంశము మిగులసులభముగ నున్నట్లగుపడినని జదివినకొలది గవిహృద్యము దెలిసి గ్రంధకర్తలయసదృశప్రజ్ఞావిశేష ము దేటపడును.మూలమని దుండురసమునకు, గాంభీర్యమునకు భంగము కలగకుండ తాముసులభ శైలిని దెనిగించ గలిగితిరి.ఈయాంద్రరఘువంశము బాలురచేతను స్త్రీలచేతను జదివించినయెడల వారికి బుద్ధి వికసించును. మనస్సున కానందము కలుగును. మీ యాంద్రరఘువంశ మాంధ్రవాజ్మయ ములో శాశ్వతముగ నుండదగుగ్రంధమగుటజేసి యాంధ్రదేశీయులు మీగ్రంధమును దగిన ట్లాదరింతు రనినమ్ముచున్నాను.

పురాణం నాగభూషణం.

                    ----
III.  బ్రహ్మశ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రిగారు.

అయ్యూ ! మీరు స్నేహపూర్వకముగా పంపిన యాంధ్రరఘువంశమును సావధానముగా జదివి ముగుల సంతసించితిని.

   ఆకావ్యము మిక్కిలి మనోహరముగ్ను సంక్షిప్తముగను మూలానుసారము గను నున్నది. కాళిదాసునికవిత్వమాదుర్యము బయల్పడున  ట్లాగ్రంధము సుబోధమగుపద్యకావ్యముగా దెనిగించు టాంధ్రలోకమున కుపకారము చేయుట యని తలంచెదను. మఱియు నందు మూలము సయితము ముద్రింపించుటచే నాపొత్తము సంస్కృత మునచదువంగోరువారికి నుపకరించును.
ఠాపురము

చిత్తగింపుడు.

17-8-13

విధేయుడు,

పురాణపండ మల్లయ్యశాస్త్రి.