పుట:Geetanjali (Telugu).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

నీదుగానంబు వెలిగించు ♦ నిఖిలజగము;
నీదుగానావిలం బాడు ♦ నింగి జెలగ ;
నీదుగానాచ్చవాహిని ♦ నిఖిలశైల
వస్రముల వ్రచ్చి నఱచు ని ♦ ర్వక్రగతిని.
పాడనీతోడ నామది ♦ వలచు గాని
తగినకంఠస్వరము లేమి ♦ దల్లడిల్లు;
గడగి భాషింపగానంబు ♦ గాదు గాన
"నతులభవదీయగానజా ♦ లాంతరమున
నాదుమది జెఱగొంటి వొ ♦ నాధ ?" యంచు
నఱతు నెల్గెత్తి నేను ని ♦ రాశం జెంది.

4


నాదుప్రాణంబునకును బ్రా ♦ ణంబు నైన
నీవు సర్వాంగ మంట న ♦ జీవుడంచు
దెలిసి, నిర్మలముగ నాదు ♦ దేహముంప
జతన మొనరింతు శక్తి వం ♦ చనము లెక.
బుద్దిదీపంబు మన్మనం ♦ బున నమర్చు
నట్టి సత్యస్వరూపి డీ ♦ వంచు నెఱింగి
తలపులోనుండి యనృతముల్ ♦ తొలగ జేయ
జతన మొనరించు శక్తివం ♦ చనములేక.
హృదయకుహరాంతరంబుస ♦ ర్వేశ ! నీకు