పుట:Geetanjali (Telugu).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

2

పాడు మనునాజ్ఞ నీచేత ♦ బడసినపుడు
గర్వభరమున నెద నిచ్చు ♦ కరణి దోచు;
నంత నాదృష్టి నీముఖ ♦ మందు బఱుప
గనుల నానందపూరముల్ ♦ గ్రమ్మి పాఱు
జీవితములోనిద్వంద్వముల్ ♦ చెఱగి కరగి
యొక్క రమ్యశుభాకృతి ♦ నొంది యొప్పు;
బక్షములు విచ్చు బూజ్యభా ♦ వంబు పొదలి
యబ్ది దాటంగ నెగయు వి ♦ హంగమట్లు
నదుగానంబు నీకు నా ♦ నంద మంచు
దేవ ! నీసన్నిధిని నేను ♦ గేవలంబు
గాయకుండ గాని వేఱేమి ♦ గానటంచు
దేటముగ మదిలోపల ♦దెలియవచ్చు,
అల రెడుమదీయగీతస ♦ క్షాంచలమున
నందగా గాని నీదుపా ♦ దాబ్ద మంటి
గానరస మాని మది చొక్కుం ♦ గాంచియుంట
విభుడ వగునిన్ను సఖు డని ♦ పిలుతు మఱచి

3


ఎట్టిదో నాధ ! నీగాన ♦ మే నెఱుంగ ;
నిరత మాలింతు నాశ్చర్య ♦ భరితుడగుచు;