నిశ్చయించుకొని కూర్చున్నా, అది ఒక ధోరణిలో ప్రారంభం కావడం, మధ్యన మరియొక ధోరణిలోకి పోవడం, తరువాత మరియొక ధోరణికి రావడం ఇది మామూలై పోయింది. ఇది నా చేతకానితనమని యైన కొందరనుకోవచ్చును. విషయమును బట్టి ధోరణి అట్లు మారవలసి వచ్చినదని యైనా కొందరనుకోవచ్చును. ఇదైనా నాఒక్కని నుదుటనే వ్రాయబడ్డ వ్రాతలాగ కనిపించలేదు. ప్రస్తుత వార్తాపత్రికా సుప్రసిద్ధ విలేఖరులనుకొనబడే అనేకుల వ్రాతలలో యింతో కొంతో యిటువంటి భేదము లగుపించుచున్నవి. తొలిచూపుకు ఇది వెఱ్ఱి వెంగళప్ప ధోరణుల వలె కన్పించును. కాని నిదానించి చూస్తే యిది యీ విధంగా యీ కాలంలో వుండక తప్పదు కాబోలు ననిపించుతుంది. కేవలం పాఠ్య పుస్తకములను వ్రాసేవారు కొంచెం పట్టు పూరాగా పూర్వపుధోరణిలోనే వ్రాస్తున్నారు. లేకుంటే అవి పాఠ్య గ్రంథములుగా అంగీకరింపరేమో అన్న భావం చేతను, అయినా వారు ఆసమయముల యందు తీసుకునే అతి జాగ్రత్త, భయము, అవ్యగ్రత అందులో కనిపించుతునే ఉంటుంది. అయినప్పటికీ కేవల పాఠ్యగ్రంథములు ఆ దోరణిలో ఉంటే వచ్చే ఉపద్రవం యేమీ లేదు. అవి బాలకులకు పాఠశాలలో ఉన్నంతకాలం గమనించవలసిన కొన్ని సూత్రములను మాత్రమే సూచించును కాని, పాఠశాలలను విడచి పెద్ద వారైన తరువాత వ్రాయగల గ్రంథములే ధోరణిలో వ్రాయవలెనో నిర్భందించవు. కేవల పాఠ్యపుస్తకములు కాక గణితము, భూగోళము, చరిత్ర సైన్సు మొదలైన విషయములను వ్రాసే పుస్తకములలోని భాష ఇన్ని కట్టుదిట్టములతో ఉండవలెనని నియమించ నక్కరలేదు. ఏ గ్రంథకర్తకు ఏ ధోరణి యే సమయమున బాగుంటుందని తోస్తే ఆధోరణిలోనే వ్రాయవచ్చును. ఆ పుస్తకములను విద్యార్థులు పఠించడం ఆధోరణి కొరకు కాదు. ఆ విషయ విజ్ఞానము కొరకు. ఏ విషయమైనను సుగ్రాహ్యముగ ఉండవలెనంటే, ఆయా సందర్భములకు తగినట్లు గ్రంథకర్త ధోరణిని మార్చుకొనక తప్పదు. కనుక పాఠ్య గ్రంథ నిర్ణయ మండలులవారు పూర్వపు అధికరములతో విఱ్ఱవీగి, నవీన గ్రంథములను ధోరణుల కారణముగా త్రోసివేయరాదు. విషయము మనోహరమై, అవశ్యమై యున్నప్పుడు, గ్రంథము ప్రవీణునిచే వ్రాయబడినప్పుడు వారు దేనినై నను అంగీకరించక తప్పదు. లేని యెడల యేవేవో కొందరికిష్టమైన శయ్యా పద్ధతుల నభివృద్ధి పరచుట కొరకు ప్ర్రశస్తమైన విషములనే త్రోసిరాజు చేసిన నేరము వారియందు నిలచును.
74
గరిమెళ్ళ వ్యాసాలు