పుట:Garimellavyasalu019809mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాయమైనవో యెవ్వరూహింపగలరు? ఆనాటి వ్రాతప్రతులేవైన దిరికిన యెడల ఇది ఆంధ్రయేనా అను సందేహము మనకు కలుగక మానదు.

   అయినను అస్థిరమైన బాషలు మాతునంత వేగముగా స్థిరమైన భాషలు మారవు. స్థిరమైన భాషలలోకి యెన్నిమార్పులువచ్చినను వానియాచార రూపము ఒక రీతిని శాశ్వత ముగానే ఉండును. ఆంధ్రభషకు నన్నయభట్టు కాలమున ఒక మొస్తరు స్థిరత్వమేర్పడినదని చెప్పవచ్చును. అతని తర్వాత సమసిద్ధులైన కవిద్యయము అతని వరవడిని బట్టి తమ గ్రంధములు వ్రాయుచుండిరి. తరువాత కవులు తమ పదములు కవిత్రయ ప్రయోగములేనా ఒక ప్రమాణము బట్టి కొలుచుకొనుచుండిరి తరువాత నెందరో కవులు నూతన ప్రయోగములు చేయుచున్నను మహాకవి ప్రయోగముల కున్న గౌరవము అల్పకవుల వ్రాతలకు లేక మాడిపోవుచుండేడివి. మహాకవులు కూడా అనేకులు పుట్టి నూతన ప్రయోగములను నిరసించుచుండేడివి. మహాకవులు కూడా అనేకులు పుట్టి నూతన ప్రయోగములను నిరసించుచుండుట వలనను భాషకొక క్రొత్త మోస్తరు స్థిరత్వమేర్పడినది. ఇది పద్యకావ్యముల దోరణి.
    గద్య కావ్యములకును, పదకవిత్వములకును ఇట్టి నిర్బందము లేవియును లేకుల్ండెడివి. సాధారణ కవి మండలులు, వ్యాసకర్తలు వ్యాఖ్యాతలు వాడుకభాషను విరివిగా ఉపయోగించి మహాకవ్యమూల యందలిగూఢ్యార్ధములను తేట తెలుగులో ప్రజలకెఱుకపరచుచుండిరి. ఈవ్యావహారిక భాషా వ్యాఖ్యానములు విరివిగా నుండుట వలన కావ్యభాష ప్రాతగిల్లక ఏనాటికిని సరిక్రొత్తదగు నూత్నత్వముతోనే రాణింపజొచ్చినది. ఈ విధముగా ప్రాతక్రొత్తలు స్నేహముగా సరళరీతిని మధ్యయుగము లేక రాయల యుగము దాకా  వర్ధిల్లినవి. రాయల యుగములో నాంధ్రభాష ఒక మహోన్నత్వదశ ననుభవించినది. ప్రాత పురాణ కవిత్వములోనికి క్రొత్త ప్రబంధ ఫక్కీలు ప్రవేశించినవి. క్రొత్త కల్పనలు నిరాఘాటముగా సాగుచుండినవి. వీనితోకూడా క్రొత్త ప్రయోగములు విరివిగా దూరినవి. కవులను పొషించుట, కవిత్వమ్లను వినిపించుట, రాజులకు మంత్రులకు, శ్రీమంతులకు పరిపాటియైనది. ఆకాలమున పుట్టిన ప్రబంధములకును, కృతులకును అంతులేదని చెప్పవచ్చును. నేటికి అచ్చుపడిన నెన్నొపడగా మిగిలవెన్నో తంజావూరు భాండాగారమునందును  గృహస్థుల గృహములందును యున్నవి. ప్రతి గృహస్థునకును తానొక కవి
గరిమెళ్ళ వ్యాసాలు