(deliberate Plot) ఉండవలసిన ఆవశ్యకత లేదు సరేగదా అది యెంత లేకపోయిన కథ అంత స్వతస్సిద్దమై యున్నట్లగుపించును.
చిత్ర విచిత్రముగా నల్లిన వ్యూహము (Plot) లేనిదీ. శౌర్య పరాక్రమాది రసప్రధానము కానిదీ, అద్భుతాశ్చర్యములు వెలిగ్రమ్మనిదీ, రహస్య పరిశోధకులు వెన్నాడి లోక కంటకుల గుట్టుమట్లు కనిపెట్టి పాఠకుల కుతూహలము తీర్చనిదీ విరహవేదనల తోడి విప్రలంభములు, సుందర పద్యముల తోడి మోహలేఖలు, శబ్దాద్యలంకార యుక్తములగు ప్రకృతి వర్ణనలు లేనిదీ నవలయేమిటి అని ఇప్పటి పాఠక లోకమున కచ్చెరువు కలుగవచ్చును. కాని యిట్టి విశేషములు సంఘములో నెప్పుడేని కలుగుచుండును గనుక కథలనియు, సదా సంఘములో నిల్చి జరుగుచుండవు కనుక సాంఘిక నవల కథ కాదనియు, కథకాని సాంఘిక చరిత్రలో నిట్టివి తరచు కలుగుచుండవు గనుక సాంఘిక నవల యిట్టి పై పై తెచ్చుకోలు విశేషము లేక, సాధారణ సంఘము వలె చల్లగా, సాధారణపు టచ్చటలు, ముచ్చటలు, కష్ట సుఖములు కోరికలు, ప్రయత్నములు జయాపజయములు మొదలగు వనితో గూడి సంఘము యొక్క సాధారణ సమయ వాహినీ చిత్రము వలె నలరారవ లెను.
--భారతి, 1932 ఆగస్టు
గరిమెళ్ళ వ్యాసాలు
67