పుట:Garimellavyasalu019809mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరసున్నలు, నెరసున్నలు, లేక అనాయాసకరమైనదిగా నుండక తీరదు. లెనియెడల నాపాత్రలు మనకు వింత గొలుపును గాని నైజత్వమును స్పురింపజేయవు వారి సంభషణపై విమర్శనములు, వారు సంభాషించుచుండు తరి వారి హావభావ విలాపములను వర్ణించు భావములు కూడా ఆ శైలిలోనె వ్రాయుట యెంతయును యుచితము కవి తానుగా నొనరించు స్థలాదుల వర్ణనలు, సంఘ సమస్యలు చర్చలు, పాత్రల యోగ్యతలను గూర్చి అభిప్రాయములు కనుక పాఠకులు శ్రమ తీసుకొని చదవగలదు. కాని పాత్రలే మాటలాడునప్పుడు లేదా వాని సంభాషణలు ప్రక్క ప్రక్కను వచ్చుచు వాటి సున్నితములను మనము గ్రహించుటకు కవి సహాయము చేయవచ్చునపుడు, కవి తన ప్రతిభణూ, ఫాండిత్య్హమును, కల్పనా ప్రాగల్భమును జొప్పించక పాత్రలను తమంతట తామే వచ్చును పోవును మాటలాడునట్లు చేయవలెను.

  చారిత్రక నవలల వలె మోహశౌర్య ప్రధానములగు నద్భుత నవలల వలె, కూఫీలు తీసెడి చమత్కారముల చూపు రహస్య పరిశోధన నవలల వలె సాంఘిక నవలలు కధా ప్రధానము లైనవి కావు. వీటికి ఒక మొదల్, ఒక నడుమ, ఒక తుది అని యుండవలసిన అవశ్యకత లేదు. సంఘము పోకడయు మానవుల సామాన్య సాంసారిక చర్యలే యొక మనోహరములగు నవల లాంటివి దానిని చిత్రించుట కెక్కడ నుంచి ప్రారంబించి యెక్కడితో మనమాపినను ఒకటే మన గ్రంధ ప్రారంభమే ఆ కధ యొక్క ప్రారంభము కాదు. మన మాపిన మాత్రమున ఆ కధ ముగిసిందని చెప్పుటకు వీలులేదు. కాలశకటములో ప్రయాణము చేయుచు కవి చూపినంత మేరకు మనము చూచినాము. చూపని మేరలను కూడ చూడవలెనని యున్నను మనకు సాధ్యము కాక యూరకొనుచున్నాము. సంఘములో ఏ గ్రామములో లేక ఏయే వ్యవహారంలో  ఏయే రంగములకు సంబంధము గలదో ఆయారంగముల వాయావరుసను చిత్రించు కొనుచు పోయినచో చాలును. కరణాంతరములచే వాటికి ముందుండిన రంగములను విడువ వచ్చును. వాటి తరువాత రంగమును చిత్రింపక పోవచ్చును.  ఈ కారణముల చేత ఇట్టి నవలలను శ్రమపడి ఆలోచించి పన్నవలసిన వ్యూహం లేక చట్రము
గరిమెళ్ళ వ్యాసాలు