యెదుట ప్రవహించుచున్న కాలవాహినిని గాంచుచు అందలి విషయములను గూర్చి వ్రాసినపుడే సరియైన సత్యము చిక్కును గాని రసపుత్రయుగము నాటిదియు వంగభాష మాటాడు వంగదేశమునకు సంబంధించినదియు రాయచూరు యుద్ధము వలె ఏ విజయనగర సామ్రాజ్యము నాటి ఆంధ్రుల చరిత్రకో సంబంధించిన దియు నగు విషయము నెత్తుకొని వ్రాయగడంగినచో మన చర్మ చక్షువుల యెదుట జరుగు అకళంక సత్యమును గాక ఊహా చక్షువు నెదుట గోచరించు నట్టియు అభూతకల్పనలతో కూడినట్టియు శృంగార, వీర, శోకాద్భుతాది రసంబులతో మన డెందముల నానందకల్లోలినిలో నుంచునట్టియు, విచిత్రకాల్పనిక సత్యమును మాత్రమే చిత్రించినదగును. పందొమ్మిదవ శతాబ్దమున జీవించిన థేకరియను ఆంగ్ల నవలాకారుడు పదునెనిమిదవ శతాబ్దము నాటి యొక కథను నవలా రూపుముగా వ్రాసెను. అందుకొరకా శతాబ్దపు మర్యాదలు, సంభాషణములు మొదలగునవి యెన్నో పఠించి చిత్రముల నెన్నింటినో దర్శించి కష్టపడెను. అయినను అద్భుత కార్యమొనర్చిన యొక ప్రజ్ఞావంతుడుగను, సాధింప సాధ్యము కాని కృత్యమును చాలవరకు సాధించిన యొక వీరునిగ మాత్రమే పరిగణించుచున్నారు. కాని దానిని సంపూర్ణమగు సాంఘిక నవల యని వ్రాయుటకే విమర్శకునకు చేయిరాకున్నది.
సాంఘిక నవల యనగా కథ యే కాలమునకు చెందినదో ఆ కాలముయొక్క సరియైన చిత్రము. గ్రంథకర్తలు తరుచుగా తమ కన్నుల యెదుట జరుగుచర్యలనే సరిగా చిత్రించలేక యేదో ఒక అభాసము చేయుచుందురనిన వేరొక కాలము నాటి చిత్రము నెట్లు సరిగా వర్ణించగలరు? వారు వర్ణించిరని నిర్ణయించగల తీర్పరు లెవరు? జరుగుతున్న కాలమునాటి దానికి సజీవమగు ఆ సంఘమే సాక్షి. ఏ మాత్రమెచ్చుతగ్గున్నను యే యమ్మలక్కలైనను కనిపెట్టగలరు. ఇక విమర్శక విశారదుల మాట వేరే చెప్పనేల?
కనుక సాంఘిక నవలను వ్రాయబూనువాడు తన కాలము నాటియు, తనకు తెలిసినట్టియు, తాను కనినట్టియు జీవితాంశముల నెత్తుకొని వర్ణింపదొడగిననే సఫలీకృతుడగును. కాని 'అనగనగా నొకరాజు ' అని యే పూర్వచరిత్రనో గైకొనినచో కేవల పరిహసపాత్రుడగును. కథ జరిగి తీర
62
గరిమెళ్ళ వ్యాసాలు