Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకులు కలవిగాను, వారు ఒకరి ప్రేమ నొకరు చూఱగొనుటకు చేయు త్యాగములు, విలాసములు, పరిశ్రమలు మొ॥నవి విషయములుగా గలవిగాను, చాలమట్టుగ చరిత్రాత్మకములు గాను, కొంత వరకు అద్భుతములతో కూడినవిగాను నుండెడివి. అయిరోపా ఖండము ఇటాలియను సాహిత్య పరిచయము వలన బడసిన నూతన భావములతోను, ఉత్సాహములతోను ఉఱ్ఱూతలూగెడి సమయమున వివిధ దేశములలో ప్రథమమున వెలువడెడి నవలలిట్టివి గానే యుండెడివి. ఆంగ్లేయ బాషలో స్కాటు నవలలను పఠించు వారికి వాటి లక్షణములు తెలియగలవు. మనదేశములో రసపుత్ర శౌర్యముగ రచించిన విమలాదేవి, రాణి సంయుక్త మొదలగు నవలలు కూడా నిట్టివే.

ఈ నవలలను పఠించుట వలన నవలయను పేరు మోసెడి ప్రతి గ్రంథమునకును కొన్ని పడికట్లుండుననియు, అది లేనిచో ఆ గ్రంథము నవల కాదనియు అభిప్రాయము సాహిత్య ప్రపంచమున నల్లుకొనెను. ఆపడికట్లు ఉన్నత వంశమునకు చెందిన నాయికా నాయకులు, వారొకరికొరకొకరు తప్పక త్యాగము చేసి యిడుములు గుడిచి తమ ప్రేమను ఋజువుపరచుట, నీతిదాయకమై నెగడుట, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై లలితమై, గంభీరమై యుండుట ఆయాతావుల కథకెంత యవసరమో అంతకు మించియు (కథనడకలో విస్తారము సంబంధము లేకపోయినను సరే) ప్రకృతి వర్ణనములు సలుపుట మొదలగునవి. ఈ విశ్వాసము నవలా ప్రపంచమున నొక మూర్ఖమతము వలె వ్యాపించి యీజాతి నవలలన్నియు స్థల నామములు, పురుష నామములు మత్రమే భేదముగా సమస్త దేశముల నవలలు నొక్క తీరుగా నుండునట్లు చేసినది. ప్రత్యేక స్థలముల యాచార వ్యవహారములు గాని, నిరూపణలు గాని, వ్యక్తుల పోలికలు గాని చేజిక్కక యువకజనోచితంబగు నుత్సాహమును మాత్రమినుమడించుచు, అద్భుత చర్యల పఠనమున కాస గొలుపుచు వచ్చినవి. వీటిని నవలలు కావని యెవ్వరును ననజాలరు. అవియొక రీతి ననలలు. సాంఘిక నవలలు కావు.

సంఘజీవనము నందాసక్తి పుట్టి, వారి యాశలు ఆశయముల యందు

60

గరిమెళ్ళ వ్యాసాలు