పుట:Garimellavyasalu019809mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాంఘిక నవల

    మన ఆంధ్రమున నిప్పటి కొక వేయి వనలలయినను ప్రచురింప బడి యుండవచ్చును. వీటిలో ననేకములు బంగాలీ, హిందీ, మహారష్త్రము మొదలగు దెశీయ భాషలనుండి తర్జుమాలైయున్నవి. వీటిలో గూడ కొన్ని మహమ్మదీయ, మరాష్ట్ర రాజపుత్ర యుగములనటి చరిత్రాత్మకములై యున్నవి. కొన్ని బ్రిటిషు యుగము నాటి రహస్యపరిశోదకములై యున్నవి. మఱి కొన్ని పౌరాణీకములై కూడా యున్నవి. అతి కొంచెము మాత్రము గ్రంధకర్తలు తాము స్వయముగా నాలోచించి వ్రాసినవై యున్నవి. ఆటిలో గూడ మరల ఆంధ్రదేశపు టాచార వ్యవహారములకును, ఆంధ్రదేశపు పల్లెలు, పట్టణములు, ఏఱులు, సరోవరములు మొదలగువాటి వర్ణనలకును సంబంధించినవి మఱియు స్వల్పము. ఈ చివర తప్ప మఱి వేనిని గాని ఆంధ్ర సాంఘిక నవల యనుటకు వీలు లేదు. అయినను ప్రస్తుత గ్రంధకర్తలలో సాంఘిక నవల వ్రాయుదమను నుత్సాహము మిక్కుటముగా గనుపట్టుచున్నది. ఇట్టి యవసరమున సాంఘిక నవల కుండవలసిన లక్షణములెవ్వి? అవి యేట్లు మన ప్రస్తుత సాహిత్యల్మున నచ్చటచ్చట పొడసూపు చున్నవి. వాటినెల్ల సంపుటీకరణము చేసి యందమగు  సాంఘిక నవలా నిర్మాణమున కెట్లు దారితీయనగును అను అంకములను కొంచెము విచారించుట యెంతమాత్రమును నప్రస్తుల్తము కాదు. లాక్షణికులిట్టి నిర్ణయమిప్పుడు చేయనిచో ప్రతి లేఖకుడును ఏ వివాహమునకో వ్యవహారమునకో లేఅ వింతకో సంబంధించిన యొక కధనల్లి దానికి సాంఘిక నవల యను పేరు పెట్టుట తటస్థింపవచ్చును. అట్లు జరుగుచున్నది కూడాను.
    ఐరోపా ఖండములోనేమి భారతదేశముననేమి నవల యనునది పురాణములు, పద్యకావ్యములు, వచన చరిత్రములు మొదలగునవి యెన్నియో వెలువ్డిన తర్వాత నూతనముగా వికసించిన సాహితీ విశేషమని చెప్పవచ్చును. ఐరోపా ఖండములో అనేక సాహిత్య వికాసములకు లాటిను భాషయు, ఇటాలియను గ్రంధములును మార్గదర్శకము లైనట్లే నవలలకు గూడ ఇటాలియను నవలలే మార్గదర్శకములుగా నుండెను. ఇటాలియను నవలలు తరుచుగా ఉన్నత కుటుంబములకు చెందిన యువతీ యువకులు, నాయికా
గరిమెళ్ళ వ్యాసాలు