పుట:Garimellavyasalu019809mbp.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తిన్నగా ప్రవర్తించని వాళ్లకి దేముడే శాస్తి చేస్తాడనడానికి, మునసబు కూతురు ముండమోయడం, కరణం కూతుర్ని అల్లుడు వదిలి వేయడమే సాక్ష్యాలు.

   ఈ విధముగా పల్లెటూళ్ల తాలూకు కొన్ని చాయలు తీసి గ్రంధకర్త చిత్రించి ప్రచురించాడు. ఇట్టి వసంతములైన చాయలా గ్రామములపై నున్నవి. అవి గ్రహించి ముద్రించగాల్ చిత్రకారులవసరమై యున్నారు.  ఈ గ్రంధకర్త తాను రచియించినంత మేరలో పొందిన విజయూమును తానింకను పెక్కు  కధలు వ్రాయుటకు ప్రోత్సాహముగా గైకొని తన కృషిని కొనసాగించునుగాక యని కోరుచున్నాను.
- భారతి, సెప్టెంబర్, 1931