పుట:Garimellavyasalu019809mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకలనం మొదలవుతుంది. తిరువళ్ళువరు రచించిన తిరుక్కురళ్ కావ్యాన్ని 'అర్ధత్రయ సర్వస్వము' అనే పేరుతో 7 భాగాలుగా ప్రకటించ నిశ్చయించి మొదటి భాగానికి రాసిన ముందుమాట, సమీక్షా వ్యాసాలు మొదలైనవి పై దానిననుసరించాయి. 'ప్రపంచ మంతా అక్షరాలూ-అంకెలే' అనేది 25-10-38 న పశ్చిమ గోదావరి జిల్లా కేశవరంలో 'ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివు రైటర్ల మహాసభ'లో (అభ్యుదయ రచయితల సంఘం మహాసభ కాదు) చేసిన అధ్యక్షోపన్యాసం. ప్రజల్లో అక్షరాస్యత పెరగాల్సిన అవశ్యకతని, దానికై రచయితలు చేయవలసిన కృషిని ఇందులో చర్చించారు.

గరిమెళ్ళ కవిగారు, రచయితగాను కూడా ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచడానికి కృషి చేశారు. దేశ రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి, ఆంధ్ర రాష్త్రం ఏర్పాటు గురించి, రాజకీయాలను ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితుల గురించి, ఆయన అభిప్రాయాలను ప్రతిబింబించే వ్యాసాలు రెండవ భాగంలో పొందుపరచబడ్డాయి.

1926లో అప్పటి శాసన సభలలో ప్రవేశించుటకై జస్టిసు పార్టీవారు, స్వరాజ్య వాదులు, సముచిత సహకార వాదులు తమ తమ నినాదాలతో, ప్రచారాలతో బయల్దేరినపుడు ఆయా విషయాలను చర్చించిన 'భ్రమ పెట్టని వారెవరు?' అనే వ్యాసంలో ఈ భాగం ప్రారంభమవుతుంది. ఈ భాగంలో ఒకటి రెండు వ్యాసాలు మినహా మిగిలినవన్నీ 1947 నుంచి 1952 వరకు వచ్చినవి. అప్పటి కాంగ్రెస్, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు, కమ్యూనిజం మొదలైన విషయాలకు సంబంధించిన వ్యాసలు ఈ భాగంలో ఉన్నాయి. ఇందులో వ్యాసాలను పాఠకుల సౌలభ్యం కొసం తారీఖుల వారీగా కాకుండా విషయాల పరంగా ఒకచోట చేర్చటం జరిగింది.

ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి అయ్యేట్టు కృషి చెయ్యాలన్నా, ఆ దేశ అర్థిక పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని గరిమెళ్ళ మర్చిపోలేదు. ఆర్థికాభివృద్ధిని సాధించటానికి, ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి ఏదేశానికైనా ప్రణాళికలు అవసరం. అమెరికా, రష్యా, బ్రిటను, ఇండియా మొదలగు వారి ప్రణాళికల గురించి చర్చించిన వ్యాసం 'ప్రణాళికలు' మొదలైన ఆర్థిక వ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్వాతంత్ర్యానంతర

VII