పుట:Garimellavyasalu019809mbp.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోలీసు ఇనస్పెక్టరెవరిని దొంగంటే వాదు దొంగ. మేజిస్ట్రేటు కెటు మొమమాటముంటే అటు తీర్పు రిగిస్ట్రారు కియ్యవలసిన ప్రయివేటు ఫీజు ముట్టకుంటే "మూడు గంటలై పోయింది. అవతలకు పో" ఓర్సీలుకు రూపాయిలిస్తే నీరువచ్చే సదుపాయం వీలైతే చేస్తాడు. అన్ని తోవలూ సర్కారువే ఆ తోవంట బండి వెడితే జరిమానా, ఓర్సీలుకు లంచమిస్తే కాని అది తప్పదు. పట్టణములో ఇత్తడి చెంబు పట్టుకుంటే న్యూసెన్సు కేసు.

  ఈ ఉద్యోగస్తులు రిటైరైనా కాని వీళ్ళ పీడ పోదు. ఏమంటే అపుడు వాళ్ళూ ఒకళ్ళ కొకళ్ళు చుట్టాలో, స్నేహితులో ఔతారు. అందుచేత ఒకడికి వచ్చే లంచము ఇంకొక డెవ్వడూ తప్పించడు.
    వీరికెక్కడికక్కడే పుల్ఫాలు కావాలి. రెవిన్యూ ఇనస్పక్టరు వగైరాలు వస్తే కరణం గారింట విందులు పోలీసు ఇనస్పెక్టరులువస్తే మునసబు గారింట కోళ్లూ గొఱ్ఱెలూ కొట్టి భోజనాలు పోలీసు వాళ్లు అనగానే యే కారైనా ఆపేసి అందులో కూర్చొని చార్జి యెగవేయవచు. డెప్యూటీ కలెక్టరు గారి కుమారుడి కంటే మేస్టరులు  మార్కులు దిద్ది పేమచేయవలసిందే మైలుకూలీ ఓవర్సీలు దగ్గరకు పనివుండి వచ్చాడురా అంటే వాళ్ల ఆవులకు గడ్డివేసి కుడితి తాగించనిదే వెళ్లకూడదు. లంచాలు దిట్టముగా ముట్టిపోతే ఆక్రమణలు లేవు. గొంగతనాలు లేవు సర్కారు రోడ్దుమీద బళ్లు తోలడలు లేవు అంతా రామరాజ్యమే.
  పల్లెటూళ్లలో రెండవ అంశము చిలిపి జట్టీలు తొమ్మిదేండ్ల చంద్రమ్మ నడుస్తున్నపుడు ఏడేళ్ల నరసమ్మ పరికిణీ  మీద బురద పడితే నరసమ్మ తల్లి చంద్రమ్మను మోదీసింది. చంద్రమ్మ తల్లి నర్సమ్మను తిట్టింది. నరసమ్మ తల్లి జగడానికి వచ్చింది. ఎవరింట్లో మగవాళ్లు ఆ యింట్లో ఆడవాళ్ల తరపు ఎవరి చుట్టాల వాళ్లు వాళ్ల తరపు, నాలుగు రోజులిదో అలికిడి.
    మూడవ అంశము సహవాసము పల్లెటూరి కుర్రవాళ్లు చెడిపో వడ మున్నూ వెంకయ్య కొడుకు పురుషోత్తాన్ని చూచి చదువుకొని జ్ఞానం సంపాదించే వారెవరూ లేరు కాని, కోటయ్య కొడుకు రామనాధమును
గరిమెళ్ళ వ్యాసాలు