పుట:Garimellavyasalu019809mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయినను గ్రంధము నసపెట్టి నీతి బోధనలు చేయు శిక్షాస్మతివలె గాక, సుఖసల్లాపములు సలుపుచు నూనృత మార్గమున నడిపించి సుహ్వత్తునివలె సహవాస యొగ్యమై ప్రీతి దాయకమై యుండుట గ్రంధకర్త యొక్క, రచనా చమత్కృతిని చాటుచున్నది.

  ఒక కధలోని కొన్ని ప్రధానాంశముల బరిశీలింతము గ్రామ ప్రజల యొక్క మొట్టమొదటి యిబ్బంది ఉద్యోగస్తుల రాపిడి ఒక ముసలాయన చెప్పినట్లు "ఇప్పటి మునసబు కరణాలు - పెద్ద చిన్న తారతమ్యము లేకుండా ఏమి చేస్తానో చూడు నీ సంగతి కనుక్కుంటాను అనే బెదిరింపులతో యేడిపించుకు తింటూ" వుండడము పరిపాటి ఒక వూరి కరణం "లచ్చయ్య క్రొత్తలోగిటి అరుగులు ఆక్రమణము చేశాడు." అని పైకి వ్రాసి రెవిన్యూ ఇనస్పెక్టరుకు బాగా భోజనము మేపి కొలిపించి స్థిరపరచి, తాస్సీల్దారు నోటీసు అమలౌ జరిపించి వెంటనే పదిహేను రూపాయలు చొప్పున అమరాధం కడుతూ సివిలు క్రిమినలు చర్యలకు లోబడడమో జరిగేటట్లు చేయించాడు. ఆ వూరు మునపబే అంజయ్య పొలము గట్టుకొట్టి తనపొలములో చేర్చుకొని ఏమయ్యా అంటే రెండు నువ్వుల బస్తాలు అతని గడ్డికుప్పలో దాచి అతని మీద చోరీ కేసు పెట్టి మూడు మాసములు కఠిన శిక్ష వేయించాడు.  వూళ్ళోవెట్టివాణ్ని చాకలివాడ్ని, వడ్రపు పని చేసే బసవలింగాన్ని యేమర్రా దొంగ సాక్ష్య్లాలిచ్చినారని పెద్దమనిషి కొండయ్య అడిగితే "లేదుబాబయ్యా గ్రామ నౌకరికి భంగం వస్తుందని మీకు తెలియదా" యని వాళ్ల జవాబు, గ్రామ మునసబు కరణాలంటే పట్టణములోని వారిపై ఉద్యోగస్తులకు లంచము లిప్పించుచు తాము తింటూ ప్రజలను హింసించు టౌటులని అర్ధము. మరో మునసబు వెంకటసామి చేత అయుదు రూపాయలు లంచమిప్పిస్తేనే కాని ఒవర్సీలు త్వాష్టము వూరు కదలలేదు. ఇది గ్రామాధికారుల స్థితి.
  ఇక వీరి పైఅధికారులనగా పట్టణములో వుండే రెవెన్యూ ఇనస్పెక్టరు పోలీసు ఇనస్పెక్టరులు. మేజిస్ట్రేటులు, రిజిస్ట్రారులు ఓవర్సీలు మాట చెప్పనక్కరలేదు. రెవెన్యూ ఇనస్పెక్టరేది ఆక్రణమంటే అది ఆక్రమణము