పుట:Garimellavyasalu019809mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గౌరవమునకు వారి సలహాకి పాత్రమైన ఆంధ్రసాహిత్యములో చిరస్మరణీయంగ ఉంటుంది. అచిరకాలములోనే యింతకంటే విపులమైన మరియొక అనుశాసనమును కూడ రచించి వాడుక భాషకును తన్మూలమైన గ్రాంధిక భాషకును గూడ మరింత కృతజ్ఞతకు పాత్రులై శ్రీశాస్త్రిగారు దీర్ఘాయుష్మంతులను సుఖజీవులును నగుదురు గాక యని యీశ్వరుని ప్రార్ధించుచున్నాను. పరిషత్తు వరు చేయబూనుటకు సాహసించలేక పోయిన ఈ మహాత్కార్యమును తామొక్కరేయయ్యు గడంగుటచే వారి వందనములకు గూడ వీరెంతయు పాత్రులు.

30-4-27, క్రష్ణాపత్రిక