పుట:Garimellavyasalu019809mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సందర్భానుసారంగా సమ్మేళనము చేయుట తప్ప మన భాషాభివృద్ధికి వేరు మార్గము నాకు తొచకున్నది. కనుక వుభయపక్షముల్లోని పెద్దలకును నామస్కృతులొనరించి వుభయుల సిద్దాంతములను సౌందర్యములను నామనస్సునకు పట్టించుకొని, ఈ సమ్యగ్దృస్థితొ నొక శైలి నేర్పాటు చేసుకొని వ్రాయగడంగుచున్నందుకు పెద్దలు క్షమింతురు గాక! తారతమ్యములు కలవన్న మాటకాని గద్యకారులెల్లరు నిట్లే యెనరించుచున్నారు. నేమను నా కలవడిన జ్ఞానాభిమానములతో నట్లే యొనరించుచున్నాను ఇట్లు చేయుటవలన వాడుక భాషకును గ్రంధ భాషకును సన్నిహితమూ యేర్పడును. ఒక క్రొత్త రీతి సౌందర్యమూ చెకూరును. వచనరవనాకౌశల్యమున కిది యేర్పడక తీరదని, క్రొత్త పద్దతి యని యెల్లరు నంగీకరింతురని నమ్ముచున్నాను. ఇంతకు ప్రస్తుత వచన రచయితలు అందరు నిట్లే యొనరించుదున్నారు.

   ఇందుకు తగినట్లే అనుశాసన మొకటి యేర్పాటు కావలెను. అనుశాసనములకు సరిపడునట్లు రచనలైన నుండవలెను. రచనలకు సరిపడునట్లు అనుశాసనములైన మాఱవలెను. తొల్లింటి అనుశాసనములకు విధేయముగ రచనలు సంపూర్ణముగా నుండుటకు వీలు లేకున్నవి. ఉండకున్నవి, మార్పుకావలెననుట ఇది సూచన పెక్కుఱు కావలెనని కూడా అనుచున్నారు. ఇట్టి సందర్భములో అనుశాసనములను దిద్దుటే కొంత మంచి ఇట్లు కాలాను సారముగా మన పూర్వులు మార్చుకొనుచుండిరి. మార్చుకొనుట మన హక్కు మన మేల మార్చుకొనరాదు!
  ఈ శాసనపు మార్పు కూడ ఒక పెద్ద భాషా విప్లవ మనబడదు. పెద్ద పెద్ద గ్రంధకర్తళూణూ అనుశాసకులును అంగీకరించిన వాటిని గూ?డ మనము కాదనుట మన సంకోఛ దృష్టిని తెలియచేయును.అట్లు వారు ఉపయోగించని పెక్కింటికి గూడ అనుశాసనము కావలసినదే ఇట్లు  అనుశాసనములను విపులము చేసినచో ఆపుటకు వీలులేని మార్పు కావలనను వారి గొల కొంత్గ తగ్గును. కొన్ని మార్పులు చేసినచో లక్షణసిధ్దముగ వ్రాతుమను సశాస్త్రీయమైన కోరిక గల వరి అభిలాషయును నెరవేరును. అట్లు చేసిన యెడల పెక్కుఱు పండితుల ప్రాతినిధ్యము వలన రచింపబడేడి ఆ క్రొత్త అనుశాసనమునకు ప్రాతయను