పుట:Garimellavyasalu019809mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

గరిమెళ్ళ సత్యనారయణ రచించిన "మాకొద్దీ తెల్లదొరతనము ' 'దండాలోయ్ మేముండ లేమండోయ్ ' మొదలైన పాటల్లో 'జాతీయోద్యమ కాలంలో దేశభక్తుల్ని సృష్టింఇన అపర కవిబ్రహ్మ కన్పిస్తాడు.

గరిమెళ్ళ 1926 నుంచి 1952 ఆగస్టు వరకు కృష్ణా పత్రిక, భారతి, ప్రజామిత్ర, ఆనందవాణి, డంకా, కిన్నెర మొదలైన పత్రికల్లో అనేక విషయాలను గురించి రాసిన వ్యాసాలు లభించాయి. ఈ వ్యాసాల్లో ఒక విమర్శకుడు దృగ్గోచరమవుతాడు. గరిమెళ్ళ వ్యాసాలు చదివే పాఠకుడు కూడా విమర్శనా దృష్టితోనే చదవాల్సుంటుంది. లేకపోతే గరిమెళ్ళ పట్ల గుడ్ది ఆరాధనతో గుడ్ది ద్వేషమో కలిగే అవకాశం వుంది.

స్థూలంగా చెప్పాలంటే గరిమెళ్ళ ఉద్యమాలు ఊపులో ఉన్నపుడు పాటలు రాశారు. ఉదృతి మందగించినపుడు వ్యాసాలు రాశారు.

'రాజకీయాలనుంచి కవిత్వ విషయాలు ఎన్నుకోవాలి ' అని చెప్పిన గరిమెళ్ళ చివరివరకు రాజకీయాలకు చేరువలోనేవున్నారు. ఆయన వ్యాసాల్లోంచి రాజకీయాలను విడదీసి చూపటం, ఇవి రాజకీయమైనదని ఎత్తి చూపటం కష్టం. అన్నివ్యాసాల్లో రాజకీయ స్పర్శ వుంటుంది. ఆయన రాసిన వ్యాసాలను విభజించే ప్రయత్నం చేసి, ఆ యా వ్యాసాల్లో ప్రధానంగా వున్న అంశాలను బట్టి 2 భాగాలుగా విభజించవచ్చు.

1. సాహిత్యం. 2. రాజకీయం.

గరిమెళ్ళ కవి, గాయకుడు, రచయిత, అందువల్ల ఆ కవి, గాయకుడి సాహిత్యాభిప్రాయాలను తెలియచేసే వ్యాసాలను మొదటి భాగంలో చేర్చడం జరిగించి.

సాహిత్య వ్యాసాలు 1928 నుంచి 1938 వరకు లభించాయి. మనం యిపుడు పేర్కొంటున్న ఆధునిక సాహిత్యాన్ని (కందుకూరి నుంచి తరువాత వచ్చిన సాహిత్యాన్ని) నూతన సాహిత్యంగా గుర్తించి, ఆ సాహిత్యాన్ని అనేక కోణాలనుంచి పరిశీలిస్తూ 'నూతన సాహిత్య విజృంభణము ' తో యీ