పుట:Garimellavyasalu019809mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయిష్టులుగ నుండేడి శ్రీమంతులు అనంత సంపదలపై, చిన్నదైనను ఈ తప్పనిభారమును వైచుటకు సాహసించుచున్నాను నాలుగైదు వేల రూపాయలు పోగుకానిదే యీ గ్రంధములు ముద్రణా లయముల నుండి బయటికి రావు. ఈ సహాయము నాకెంత వేగిరము చేకూఱినచో నన్నంత వేగ మీసదుద్యమమునుంచి ముక్తుని చేసి భారము తగ్గించి విశ్రాంతి ప్రసాదించిన కీర్తి యాంధ్ర లోకమునకు జెందును. అంతవఱకు నొంటరిగా ఈ యుద్యమములో దానిలో నుంచి నాకును కాక గ్రంధములకును గాక రైళ్ళు హోతాలు మొదలగు అగుపించరాని శుష్క ఖర్చుల క్రింద కొంద జారిపోవుచు, రెండేండ్లలో తీరవలసినది పదేండ్లకైనను తీరునో తెలియక, నాలుగు వేలలో తీరునది పదివేలతో గాని ముగియక, అంతయును పూర్తికాక సగములో నాగిపోయినచో కార్యంకొనసాగించలేకపోయిన కళంకమునకు ధనమును దుర్వ్యయము చేసిన అపదూఱునకును నెఱయై క్రుంగవలసిన అగత్యము నాకు కలుగును. ఏది యెట్లయినను కార్యము కొనసాగించనిదే విరమించవలెనను నుద్దేశ్యము లేదనియు, అంతవరకు పుస్తకములకు వారు భావించు రీతిని నెక్కూ ఖరీదులు పెట్టుచున్నను పోషక రాజపోషక విరాళములు కోరుచున్నను, నేను పొందుచుండు కఠిన దూషణములకు బదులుగా నప్పుడప్పుడిట్టి మృదులములగు సమధానముల నిచ్చుచున్న క్షమింపవలసిన ధర్మమాంధ్ర పూజ్యులెల్లరి పై నున్నదని మనవి చేయుచు, వారిని నితరులను గూడ ఇకముందు కూడ ఇంతకన్న నెక్కువగా చేయుచుండ వలయునని ప్రార్ధింపుచు, నేను చేసిన యపరాధమునకు క్షమింపవలయునని ఈశ్వరుని గూడ వేడుకొనుచు విరమించుచున్నాను.

--అర్ధత్రయ సర్వంవము  

(తిరుక్కురళోకావ్యానికి మున్నుడి) 1926