పుట:Garimellavyasalu019809mbp.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాష సుందరముగను మనోరంజకముగను నుండవలసిన పనిలేదు. తెలుగు మాటలాడుటలోను వ్రాయుటలోను కాస్త ధోరణియున్నచో చాలును. కాలక్రమేణ దానికి కొంత పరిభాష యేర్పడి, ధోరణి నలిగిపోయి ప్రవాహము వలె నుపన్యసించుటకు వీలిచ్చును. ఇంగ్లీషుభాష బెంగాలీ భాష, మొదలగు బాష లెల్లయు నీ శైలి నిట్లే యలవరచుకొన్నవి. తెలుగును నిట్లే యలవరచుకొనగలదు. ప్రయత్నము చేయకుండా వెనుకకు తగ్గియుండుట వలన పనియే ప్రారంభము కాదు. ఆంధ్ర యూనివర్సిటీ వారు లేనిపోని సందేహములు పెట్టుకొని కాల విలంబనము సేయుట కంటే యెక్కువ అవివేకమైన పనిచేయలేరు.

వాడుకభాష

'
 గిడుగు రామమూర్తి పంతులుగారు ప్రారంభించిన వ్యావహారిక భాషావాదము లోని సమంజసత్వము గూర్చి యొక్కసారి ఆలోచించి యీ అంశమును ముగింతము. ఈ వాదము అమలులో గద్యవచనము నిమిత్తమైయే ప్రారంభింప బడినదని ఆయనే చెప్పుచున్నారు.  గీతకవిత్వము లోనికి వ్యావహారిక భాషా ప్రయోగములు జోరుగ బోవుచున్నవన్నచో గద్య కావ్యములోనికి పోకుందా వాటి నెవ్వెరాపగలరు? గద్య కావ్యము లోకి కంటెను గూడ గద్య విమర్శ గ్రంధముల లోనికిని , గద్య శాస్త్ర గ్రంధముల లోనికిని ఆవాడుక పదము లెక్కువగా పొక తీరదు. మాలపల్లి వంటి నవలలు ఆ వాడుక పదములను అసంఖ్యాకములుగా లోన జేర్చుకొనియును చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి నవలల కంటె తక్కువ మనోరంజకముగను మధురశైలి  నంతముగను నున్నవని చెప్పంజాలము.  బారతిలోను సఖిలోను ప్రచురింపబడుచుండు చిన్న కధలు లెక ఆఖ్యాయికలు రచన, రసపరిణామము, కళ మొదలగు విషయములలో నెట్లుండినను ఆకర్షణ శక్తిలో గ్రాంధిక భాషలోని కధల కంటే మిన్నగ నున్నవని చెప్పక తీరదు. చిన్నయసూరి నీతిచంద్రిక, యెక్కువ అపురూపములగు పదములతో వారు పరిచయము కల్పించి నిఘంటువు చూసుకొని భాషాజ్ఞానము వెచ్చించునట్లు చేయుచున్నను వీటికంటే యెక్కువ ఆకర్షకముగ లెదు. ఈ భాషలో ఆ కధలు వ్రాసినందువలన  దాని వన్నె యేమియును తగ్గదని చెప్పగలము. భాషా పరిశ్రమము కావల్సిన వారే