పుట:Garimellavyasalu019809mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందులోని పాత్రముల స్వభావముల ఔచితులు చర్చించుట, తోడివారి గ్రంధములలోని పాత్రములతొ పోల్చిచూచుటలు, అందులో మానవస్వభావమున కొప్పిన నెంతవరకొ విపరీతమెంత వరకో మొదలగునవి యెల్ల విమర్శన చేసి కవితత్వమును గ్రహించి, పాఠకులకు దానిని చెప్పి, విద్యాధికులకును విద్యాహీనులకును గూడ ఆయా గ్రంధములను పఠించి, విమర్శించి తమ తమ అభిప్రాయములకు వారు వచ్చెడి రీతిని చేయగల యుత్సాహమును పురిగొల్పుట, ఇది నిజముగా నొక కధ. పాశ్చాత్యదేశములలో నిది చక్కగా వన్నె కెక్కి విమర్శకుడు కవితో తుల్యమైన స్థానము నలంకరించు చున్నాడు. విమర్శకుడు కేవలము వ్యాఖ్యాత కాదు. కవి హృదయగ్రహణ విద్యాధురీణుడు, కొత్త సిద్దాంతములను క్రొత్త సత్యములను గ్రహించుటలో నతనికి గల బుద్ధి కవిబుద్దితోను, చారిత్రకుని బుద్దితోను, ప్రకృతి శాస్త్రములలో గొప్ప గొప్ప సిద్ధాంతములను కనిపెట్టి పెద్ద మార్పులు చేయుచున్న బోసు మొదలగు వారల బుద్దితొను, జ్ఙానాధిక్యముచే బ్రహ్మమును తెలుసుకొన్న వేదాంత బుద్దితోను తుల్యమైనదిగా యెన్నబడుచున్నది. అట్టివారి బుద్ది ప్రసరించినచో రామాయణ బారత భాగవతములు ప్రబంధ రాజములు మొదలగున వెల్లయు మనకు క్రొత్త సత్యములను క్రొత్తధర్మములను క్రొత్త సందేశములను వ్యక్తీకరించును. ఈ పని కేవలమున్ను కవిని పొగడ దొరకొనుట వల్లను లభించదు. కవికి విముఖుడగుట వలన లభించదు కవితో యేకమయి కవివలె చూడగల శక్తి నలవరచుకొనుట వలన లంబించును. గ్రంధపఠనపరాయాత్తచిత్తుల కది సులభసాధ్యము. మన యువక కవులలో పెక్కురు దీనికి గడంగ వలెను.

శాస్త్ర గ్రంధములు

     ప్రకృతి శాస్త్రములను గూర్చియు ఆర్హిక సహకార తత్వములను గ్ఫూర్ఫియు కృషి శాకఖలను కాని ఇవి ముఖ్యముగా తత్శాస్త్రములలోను, తత్శాఖలలోను పండియున్న పండితులు చేయవలసిన పనియై యున్నది.  విశ్వవిద్యాలయముల వారును, విద్యాశాఖల వారును చేయించవలసిన పనియై యున్నది. ఎవరు చేసినను దీనికి కావలసినది భాషా పాండిత్య్హము కాదు. శాస్త్ర పాండిత్యము.