పుట:Garimellavyasalu019809mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నచో, వాటి నెట్లు అభివృద్ధి పరచవలెనో నిర్ణయించు కొనుటకు ముందు గతయుగములో గద్యము చేసియుండిన పనియేమో యిప్పుడు చేయవలసిన పనియేమో, నిర్ణయించవలసి యున్నది. గతయుగములో వ్రాయబడిన యే కొలది గద్య గ్రంధములైనను వినువారి మనములను రంజింపజేయుటకు వ్రాయబడిన సుందరములగు కధలు, వాటికొక సుందరమగు శైలి యవసరము. గత యుగములో గద్యమున కిది తప్ప వేరే ప్రధానమగు పనిలేదు. ఇప్పుడు గద్యము చేయవలసిన పనులు హెచ్చినవి. చారిత్రము నెల్లను పరిశోధించి తిరగ వేసి వ్రాయవలెను. వృక్షశాస్త్రము, శరీరశాస్త్రము, పదార్ధవిజ్ఞాన శాస్త్రము, రసాయనశాస్త్రము మొదలగు శాస్త్రములను బాలురకును ఫ్రౌఢులకును తెలియజేయవలెను. దేశకాల పరిస్థితులను గూర్చి విమర్శనములు చేసి ప్రజలనుద్భోదించవలెను. ఎక్కడెక్కడి వింతలను విడ్దూర్యములను పత్రికలకు వ్రాసి లోకమునకు చాటవలెను. సభలందు చర్చలు చేసి తీర్మానములు చేయవలెను. కవీశ్వరుల గ్రంధములను పఠించి విమర్శనములను వ్రాయవలెను మహాపురుషుల జీవితములను వ్రాసి బాలురకు సదాశయములు చూపవలెను. ఇదిచేయవలసిన వ్యవహారము లపరిమితముగ నున్నవి. ఇవి యన్నియును కావ్యములు కావు. వీటిలో సౌందర్యమును చూచుకొనుచు నరములు తొట్రుపాటుతనము లెమియును, పూర్వాపర సందర్భములు తప్పిపోమియు తర్కశాస్త్ర సమ్మతముగ సిద్ధాంతములును తీర్మానములను రుజువు చేయుటయు, సౌలభ్యము మొదలగు గుణములే దీనికి ప్రధానములు పరిశోధకులును, భారమునెత్తిపైగల వారును, నెల్లరును ఈ కావ్యముల యందే నిమగ్నులై యున్నారు. వీరి కర్తవ్యము వేరు వీరికి కావలసిన శైలివేరు- ఇట్టి శైలికి పితామహుడై వీరేశలింగముగారు వెలసినారు. తెలుగు జాతి యీయీ శాఖలలో వృద్ధి పొందుచున్నన్నాళ్లు ఆ మహనీయుడొనర్చిన యుపకారమునకై చేతుల నెత్తి కృతజ్ఞతను చూపక మానదు.

నవలలు
   ఇట్లయ్యును గద్యమునుండి కావ్యలక్షణములను మనము సంపూర్ణముగా విడదీయ జాలము. వీరేశలింగము గారే తమ నీతి చంద్రిక యందు ఇట్టి