పుట:Garimellavyasalu019809mbp.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషాదచ్చాయ వారి నావరించుటచేత డెందములు చిన్నబోయి దు:ఖాక్రాంతులై విషాదము, నిరాశను, ప్రావృడ్జలదముల వంటి కాఱు చీకట్లను అవ్యక్తముగ ఆంధ్ర సారస్వతము నందెల్ల జిమ్ముచున్నారు. భావ కవిత్వము మా కర్ధము కాదనే వారలు దీనిని బాగుగా పరిశీలించవలెను. రవీంద్రునివలె Mystic అవ్యక్త గీతములను వ్రాయవలెననెడి కోరికయు రవీంద్రుని దనరును కొంత తగులుట యట్లుండనిచ్చి, పాపము వారి డెందములే అప్రాప్తమనోరధములై అరజవ్వనములోనే అనర్ధములు వారిపై వ్రాలి, పాట అవ్యక్తమై గుండె గొంతుకలో నుంచి రాకుండెడి వారును, గొంతు ముళ్ళు వీడని వారును నైయున్నారు. పాపము అట్టివారి గీతములు మన కవ్యక్తములుగా మన్నవన్న ఆశ్చర్యమేమి? వీరు నిజముగా నిష్కాముకముగా పాడుచున్నవారే. గీతములు చదువు వారుండరు, కొనువారుండరు. వీరి యెడ సానుభూతి చూపగలవారు కూడా అరుదగుచున్నారు. అయినను సాహిత్య కవాటముల నెల్ల ముట్టడించి, తలుపులు బిగ్గతట్టి తమ స్వరమును పది మందియు వినునట్లు నిర్భంధించ గలుగుచున్నారు.

  అయితే ఈ గద్య కవుల కింకను అంత దురావస్థ పట్టలేదు. ఏరాముని చరిత్రయో ఒక చిన్న కధగా వ్రాసినను, ఏ ఆంధ్ర వీరుల చరిత్రములనో ఒక చిన్న గుచ్చముగాగ్రుచ్చినను  తెక్ట్సు బుక్కు కమిటీ వారి ప్రాపకముతో దానిని నేను చేయించుకొని ఖర్చులు పోగా ఒక పుస్తకము మీద రెండు వందల రూప్యములైనను లభించి వారు పొందుచున్న యితర వేతనమునకును పిత్రార్జితమగు భూమి యేమైన మిగిలియున్నచో దాని మీదనుండి వచ్చు కొంచెము శిస్తుకును తోడై జీవనమును కొంచెము సహన యోగ్యముగా చేయును. యూనివర్సిటీ వారు పద్యము లెల్లయును పూర్వ కవీశ్వరుల నుండియే యెత్తి నిర్ణయించు ట  చేత ఆ లాభము కేవలము కంపెనీలవారికే పోవుచున్నది. పోతన్నగాని, తిక్కన్నగాని, మొల్లగాని, తెమ్మనరుకదా! కాక భావకవుల విషాదగీతములను ప్రేమ గీతములను యే కుర్రవాళ్ళకు టెక్ట్సుగా నిర్ణయింపనగును?

వచనము యుక్క కర్తవ్యములు

ఇప్పటి గద్యమెన్ని శాఖలుగా నున్నదో అవి యెట్లెట్లు