పుట:Garimellavyasalu019809mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌందర్య్లము కూడా మఱియొక గుఱి ఇట్టి సుందర ధోరణిని చిందించింది లక్ష్మీనరసింహముగారి కలము విశ్రాంతి చెందింది. అప్పటినుంచి ఆంధ్రగద్యశైలిలో నెన్నైనను చిందులాడు చున్నవి గాని సౌందర్యము కాని వీనులకు విందుగొల్పు కలక్వాణము కాని మందునకైన గాన రాదు.

ఆ శైలి పడిపోవుటకు కారణములు

   ఇది యాంధ్రుకవుల లోపముగాని కధకుల లోపముగాని కాదు. ఇది గద్యయుగము, వ్యవహార యుగము విద్యా పాండిత్యముల యుగముకాదు త్రొవదప్పి యెవ్వరికైనను విద్యయును రావచ్చును. పాండిత్యము కలుగవచ్చును. కవిత్వమును రావచ్చును ఏదో యొక శైలియునలవడవచ్చును కాని ప్రతివారు కోరుకున్నదియు వ్యవహారము మన విద్యా సంస్థయున్ను విధానమున్నూ వ్యవహార కర్మాగారములు కాక విద్యాలయములను కొనుట వెఱ్ఱి అక్కడ చదువులు చెప్పుచున్నారు. పుస్తకములు గలగల లాడుచున్నవి. బాలకులు నిద్రలు లేక యేవో కంఠతాపెట్టుచు తపశ్శాలుర కంటె గూడ నెక్కువగా కృశించుచున్నారు. కాని ఇదియెల్లయు జ్ఞానాజ్ఞాన సమస్యా పరిష్కారార్ధమే కాదు. పరీక్ష పేసవుట కొఱకు అది యెందుకు? ఉద్యోగము సంపాదించుకొని పొట్ట పొషించుకొనుట కొరకు ఇప్పుడు పరీక్ష పోయినచో యావజ్జీవనమును అన్న వస్త్రములు లేక మలమల మాడిపోవలెను. కాస్త స్థితిపరులో తమ ధనమును విద్యమీద మదుపు పెట్టి పరీక్షలు పేసయి అసలు వడ్డీలు కలిపి లాగవలెనని కోరుచున్నారు. కొంత కాలము వరకు నిది లాభప్రదమై తక్కిన అన్ని వృత్తుల కంటెను నెక్కువ లాభకరముగ నుండెను గాని యిప్పుడు నిరక్షకుక్షులార్జించినంత బాగా వీరార్జించుకొనలేక, వారు సునాయాసముగా శ్రీమంతులగుచుండుట చూచి వీరి చదువులకై వీరే సిగ్గును పొందుచు తమ తొంటి యాశయము తీరదు సరేగదా, దాని వలన తలవని తలంపుగా, గలిగిన జ్ఞానము యొక్క ఫలితమును గూడ దారిద్ర్యము చేతనో విఫలమనోరధులమైతిమను నిరాశ చేతనో అనుభవింపలేకున్నారు. కవిత్వమునకు గూడనిదే గతి పట్టినది. కాని భావకవీశ్వరులు యౌవనపు మెఱుపు ఉన్నవాళ్ళు షెల్లీ కీట్సుల వలె యే ప్రేయసి మీదనో నాలుగు ప్రేమగీతములు పాడి, అనతికాలములోనే