పుట:Garimellavyasalu019809mbp.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రబంధ వచనములు

  ఇక నీ యాంగ్ల యుగములోని గద్యవచనమును గూర్చి యాలోచింప వలసి యున్నది. ఇంతకు ముందు ప్రబంధములలో గనబడుచుండెడి వచనములు పద్యముల కంటె కష్టములై, ద్వంద్వార్ధ సముపేతములై గంభీరములై, చందోబద్దముల కాని కారణం చేత యెక్కువ స్వతంత్రములై కవిప్రతిభకు పద్యములకంటె బ్రబలతర నిదర్శనములై యున్నవి.పోతనామాత్యుని గద్యములలో చాలమట్టుకు కాదంబరి పోకడలున్నవి. పెద్దన్న వచనములును సులభ సాద్యములు కావు. వచన వర్ణనము వాటి పోకడలోనే యున్నది. వచనముకూడ ఒక రీతి కవిత్వ విశేషమనియే భావించబడుచుండెను. గాని దానిలో నొక వ్యాహారిక ధర్మమున్నదని వారెవ్వరును దాని నుపయోగించినది కాదు. భారతములోని తిక్కన్న వచనములు అంతగా కవిత్వ విశేషములు కాక ముందరి కధకును వెనుకటి పద్యములకు గల సంబంధమును మాటవరుసగా చెప్పుచుండు అతుకుల వలె అతి రమ్యములై వచన లక్షణములు అనేకములు వాటికి పట్టి యున్నవి.  భారతమే ఒక మోస్తరు వ్యవహార కావ్యము అందులో తిక్కన వ్యవహార జ్ఞాని భారతమును మనలో కొందరింకను "మాలమూట" యందురు. కవిత్వ నైపుణ్యములు, అలంకార విశేషములు, ద్వంద్వార్దములు మొదలగు వానికైగాక భారతము యొక్క గొప్పతనమెల్లను కురుపాండవ జ్ఞాతుల మత్సరాభిమానములను, వీరప్రరాక్రమములను రాజకీయ వ్యవహారములను కవికదకుడు చెప్పినటుల నుండెడి పటిమకై చెందుచున్నది.

గద్యకావ్యముల శైలి

  ఇవి గాక శుకసప్తతి, హంసద్వాదశి, విక్రమార్క, కాశీ మజిలీలు మొదలగు కధలు కేవలం వచన కావ్య్లములు- వీటిలోని వ్యవహారములు, సంభాషణములు మొదలగువానికి సంబందించిన భాష భారత వచనముల వలె