పుట:Garimellavyasalu019809mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బడి అదృశ్యములగుచున్నవి. హిందూస్తానీ తళుకులును, బ్యాండు స్వరములను యానాదుల వీధి భాగవతములను గూడ ఆక్రమించుచున్నవి. కూచిపూడి భాగవతులు మొదలగు వారి శిష్యులు కూడ నాటకపు కత్తులలోనికి దిగుచున్నారు. ఇంకను గ్రామములలోనికి పోయి అక్కడి పూర్వపు బ్యాండుపద్దతులను భాగవత పద్దతులను నెర్చుకొని, సంగ్రహించవలసిన యావశ్యకత్ యున్నది. వాటిని మనము విసర్జింపజాలము. అరవదేశీయులు కర్ణాట్కపు కత్తులొవారితేరి త్యాగయ్య గారి కృతులను చక్కగా పాడగల్గుచునే, హిందూస్తానీ కత్తులో కూడా మనోహరములగు గీతములను రచించుచునే, ఇంగ్లీషు బెందు నోటుల యెడ వ్యామోహితులగుచునే వారి కావదిచిందు నొంది చిందు తేవారము, తెమాంగు, తిరుప్పుకళు, లావణి మొదలగు మెట్టుల నశ్రద్ధ చేయకుండ పాడగల్గుచు కీర్తిని సంపాదించుకొనుచున్నారు. మనవారిలో అధ్యాత్మ రామాయణము కీర్తనలు, అష్టపదులు, క్షేత్రయపదములు, తరంగములు మొదలగునవి పాడుట మఱచిపోయి ఆ పుస్తమములను మాత్రము బీరువాలలో పెట్టుకొనుచున్నారు. బాగవతము దరువులుకాని, బొమ్మలాట కలాపములుగాని, యక్ష గానౌలు కాని మునుపటి ఫక్కీని పాడలెరు సరేకదా వాటిని హేళన సేయుట గొప్ప యనుకొనుచున్నారు. కొన్ని సంవత్సరముల క్రిందట మనదేశపు పడవవాండ్రు, ఊరువుల వాండ్రు, దంపుల వాండ్రు, జోతలవాంద్రు, చెంచువాండ్రు నేవేవో గాధలు నెంతయో వింతయూగు మెట్తులో అపురూపమగు భావములతోను ఆచారములతోను పాడుచుండెడివారు. ఇప్పుడు వారి నందరిని "అప్పనాబనాతనా" ఆవేశించినది. సంగీతము, పదకవిత్వము, జానపదుల లౌకిక గానమాధుర్యము నందలిభాష మొదలగు గుణములు గల వారీ మొదలైన వాని నెల్ల సంగ్రహించవలెను. గీత గోవిందము మొదలగు వానిని పాడగల కొందరి దగ్గరకు తక్కిన వారు పోయి వాటి గమనికలు వారితో నశిమొపకుందునట్లు చిరస్థములు చేయవలెను. ఇక కర్ణాటకపు కత్తును, హిందూస్థానీ కత్తును, బ్యాండు కత్తును, నశించక వాటంతట అవియే వృద్ధి పొందగల పరిస్థితులు దేశములో పాధుకొనుచునే యున్నవి.