పుట:Garimellavyasalu019809mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వద్దనరు గదా! పదములకందని దూరసీమలకు గూడ అది సులభముగ పోగలదు గదా! పండిత పామర జనబోధకమును రంజకమును గదా! అందుచేత మన దేశములో నేమి పరదేశములలో నెమి పద్యకవిత్వము కంటె నది యెక్కువ ప్రచారము నందును జనులు నందును నుండుటలో ఆశ్చర్యమేమి! ఇంతకు పూర్వ యుగములలో నది భక్తి రంగము నందును, శృంగారము నందును మాత్రమే ప్రభాసిల్లు చుండెను. ఈ యుగములలో నది సామాన్యములగు నంశములను, దేశభక్తిల్ ప్రబోధములను నాటకములలోని పాత్రల సంభాషణములను మొదలగు వానిని గూద గుత్త గొని జాతీయజీవనము నిఉత్తేజితము నొనర్చుచున్నది. సహజమృదుల మాధుర్యమై సంగీతపు కట్టుబాటులకు సాహచర్యము సలుపు కర్ణాటకపు కత్తునకు సాయముగా అనుభవైక రమ్యములగు హిందూస్తానీ కత్తు తళుకులుం ఆంగ్ల సీమలనుండి నరతెంచిన నొక్కుల నినాదములు మొదలగునవి, యెల్ల కూడుకొని ఆంధ్ర దేశపు గీతారంగము నెల్ల అవి ఆనందపులకితమ్లు చేయుచున్నవి. నారాయణదాసు గారు గాయక శిఖామణులును, లయబ్రహ్మలును, కవి తిలకములును, పండిత శ్రేష్ఠులును, స్వాతంత్ర్య గ్రహణము నందు ఆదర్శముగా నుండు నంత యోగ్యత సంపాదించిన వారునునై తమ హరికధలలో నెల్ల పెక్కు సందర్బములు చొప్పించి అక్కని గీతములు పొదివి మన భాషకును ఆధునిక పద కవిత్వమునకును అనుపమానమైన సేవ నొరర్చిన వారు. జానపదుల అకాల్పనిక సంగీతపు పొకడలు గూడ మన యువ కవులకు నచ్చి, వారి నుత్తేజింప జేయవలసిన అవసరము కూడ వచ్చుట చేత ఆమెట్టులలోనే ఉత్తమ బావములు, ఉత్తమ భాషను జొప్పించి, వాటిలో ననుశ్రుతములుగ వచ్చుచున్న జీవ భాషను భాషారూపుములను విచ్చిన్నముచేయకుండ సంగ్రహించి గ్రుచ్చి పద కవిత్వమును (Ballad poetry) గూడ మునుపెన్నటి కన్న ఒక ఉన్నత స్థానమునకు తెచ్చి క్రొత్త క్రొత్త పనులను దానిచేత చేయించుచున్నారు. మహాత్ముని రాజకీయాందోళన దీని కొక నూతన దర్మమును, నూతన రంగమును, నూతన భాషను, నూతన కవిబృందమును ప్రసాదించెననుట కాటంకము లేదు. ఇందులో నిప్పటికే తదితర రంగములలో కంటే నెక్కువ పని జరిగినది. ఇంకను జరిగవలసి యున్నది. మన పూర్వపు పక్కీలు, మెట్టులు, క్రొత్త పద్ధతుల యడుగున