పుట:Garimellavyasalu019809mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవి కూడా బహిష్కారాలయుధమున కెఱయవకుండుటకు గానున్ను కరికాలమాంధ్రుల పాడుకొనగలుగుటకు గానున్ను, ఇవి రాజద్రోహమును పురికొల్పినవి కాకుండునట్లును, దేశీయస్థితి సంశోధకంబులుగ నుండునట్లును వ్రాయబడినవని వివేకవంతులెల్లరి కవగాహనమై యుండకపోదు.

    నేను చందాదారులకు చేర్చుటకు వెళ్ళు గ్రామముల యందును ప్రచారమునకు వెళ్ళు పురములయందును వీనిని పాడింపవలసిన వారికెల్ల వరుసలు చెప్పుచునె యున్నాను.  తద్రీతిగా నీవరుసలు ఆంధ్రదేశమున ప్రచారము కావచ్చును. ఎవ్వడు కాని నాముఖతా వినగోరిన యెడల మా కార్యస్థానమగు యా అగ్రహారము నుండి వారి యూరికగు కనీసము ప్రయాణము ఖర్చులను నాపేర మనియార్డరుగాపంపిరేని వారి యూరునకువెళ్ళి వారి కోరిక దీర్దగలుగుదును మిక్కిలి వ్యయ ప్రయాసముల కోర్చియు తొందరగా అచ్చొత్తించి యా పుస్తకమును మా కర్పించిన గౌరమీ సత్యాగ్రహాశ్రమము వారికి కృతజ్ఞతా పూర్వకనమస్కారముల నర్పించుచును యింతకంటే వేగముగామా చందాదారులకిది యర్పించలేకపోయినందుకు నన్ను క్షమింఫుడని వారిని వేడుకొనుచున్నాను.

పిఠాపురం 15.5.1926.

గరిమెళ్ళ సత్యనారాయణ సంపాదకుడు