పుట:Garimellavyasalu019809mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధం

         (నూతన జాతీయ గీతములు - ముందుమాట)

1926 లో సీతానగరం గౌతమీ ముద్రణాలయంలో మద్దూరి అన్నపూర్ణయ్య గారిచే ముద్రింపబడి, గరిమెళ్ళ సత్యనారాయణ గారిచే ప్రకటింపబడిన "నూతన జీతీయ గీతములు" (ఒకటవ భాగం) ముందుమాట

నివేదనము

   ఈపొత్తముతో మాశారదా గ్రంధమాల యొక్క నాలుగవ కుసుమమును మా చందాదారులు మొదలైన వారి కర్పించుచున్నాము.  మాగ్రంధమాలలోని గ్రంధము లనేకములు ఒకటి అచ్చుపడి విక్రయమయేటప్పటికి వేరొకటి తొందరగా వ్రాసి అచ్చొత్తించి పాఠకుల చేతులలో బెట్టెడి నవీన నాగరీక కాఫీ హోటలులోని వేడి వేడి పెసరట్లవంటివి కావు. చిరకాలము క్రిందట వ్రాయబడి అచ్చుకాకముందే అనేక పాఠక విమర్శక శిఖామణుల చెవులకెక్కిమతులు గొని ముద్రణార్హములని యెన్నబడియు, ద్రవ్యాది సాధన లోపముల ఆలస్యముగ కాని ఆంధ్ర నేత్రముల నానందింపజెయజాలని పేదరత్నములు.
    ఈ పాటల తాలూకు వరసలు కష్టములు కావు కాని నవీనములు. వీనిని నా ముఖతా యొకసారి వినినచో సులభ గ్రాహ్య్లము అగుటయే కాక ఆనందదాయకములని కూడ ఆంధ్రులు తలంపకపోరు.  ఇదివరలో నాలుగేండ్ల క్రిందట నేను జాతీయగీతములు వ్రాయుటయు ప్రభుత్వము వారి కవి కంటరొక్క సమయమగుటయు నాకు దీర్ఘకారాగారశిక్షనొసంగుటయు ఆంధ్రులు మఱిచి యుండరు.  నేను జయిలునుండి వచ్చినప్పటినుండియు ఆంధ్రులల్లరు నన్ను జాతీఅగీతములను పాడుమనుచుండుటయు, నాపూర్వపు పాటల నిషిద్ధములగుటచే నేనవి పాడుటకు అనుకామియు దేశకాల పరిస్థితులు మారుటచే ఇప్పుడప్పటి పాటలు కాక క్రొత్త పద్దతులతో క్రొత్త సందేశములతో పాటలు వ్రాయవలసి వచ్చుటయు నన్నీగ్రంధమును ప్రచురించుటకు బురుకొల్పినవి.
గరిమెళ్ళ వ్యాసాలు