పుట:Garimellavyasalu019809mbp.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈశ్వరుడు ప్రకృతివంటి మాయాచపలుడు కాదు. క్షణములో చిక్కి క్షణములో కూలెడి కించిజ్ఞవ్యక్తిదాడు. నిరీక్షించి నిరీక్షించి తన్ ప్రజ్ఞాహస్తమునామె శిరస్సుపై నుంచి, అయితే నయాన సంస్కరించడం, లెకుంటే భయాన దహనం చెయ్యడం రెండూ అతనికి సమాన విలాస కృత్యాలే.

  నిజమైన జ్ఞానులు ఆహస్త స్ప్ర్మాగమనమునకై నిరీక్షిస్తూ తపస్సు చేస్తూ వుంటారు. అజ్ఞాను లీప్రకృతియే శాశ్వతమనుకొని మోహిస్తూ క్షణిక భోగాలతోను దర్జాలతోను విఱ్ఱవీగుతూ అధ:పాతాళమున పడుతూ వుంటారు.
   ఇదే భారతీయ మహా విజ్ఞాన సంస్కృతీ విశాల లక్షణము ఇదంతా మెట్ట వేదాంతమనీ, మన భారతీయలిందువల్లనే భావదాసులై ప్రపంచ పురోగమనమున వెనుక పడిరనీ అజ్ఞాను లాక్షేపించుతారు. జ్ఞానులీవిశ్వసములో అచంచలులై ఈ మాయాదేవత చర్యలపై చిరుకన్ను వేసి మంధహాసం చేస్తూ తమతమ సంకల్ప ములయందప్రమత్తులై వర్తిస్తూ వుంటారు.
  "ధర్మమేవ్ జయతోఫ్ అను సూత్ర వాక్యమును మన ప్రభుత్వం వారు మకుటముగా ప్రతీచొటా చిత్రించబోదున్నారు. ఆ ధర్మం జయించేలోపల యొన్నో ఆధర్మములు నాశనము కావలసియున్నవి. అవన్నీపోగా మిగిలే పరమ దర్మమునకు మనము పరీక్షించుచు లోకమును సిద్ధము ఛేయ యత్నించు చుండడమే పరమ ధర్మము.
-ఢంకా, ఆగస్టు, 1940