పుట:Garimellavyasalu019809mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ధర్మమేవ జయతే"

      చట్టాలెక్కువవుతున్నకొద్దీ నేరాలు రేఖాగణిత నిష్పత్తిమాత్రం ప్రకారం వృద్ది అవుతున్నవి. కోర్టులు జడ్జీలు యెక్కువవుతున్న కొద్దీ ఆ సూత్రాల వ్యాఖ్యానాలు దురవగాహములగుచున్నవి. ఆవిధంగా న్యాయదర్మముల పరాకాస్ట ననాటికీ క్షీణించుచున్నది. నేటి నాగరికతా లోకములొ జరుగుచున్నన్ని సివిల్ క్రిమినల్ నేరాలు గత శిలాయుగములలో యెన్నడైనా జరిగియుండలేదని రూఢిగా చెప్పవచ్చును. మానవునికి ఐహిక విషయ లాలన జ్ఞానము హెచుచున్న కొద్దీ నేరాలు చేయడంలో పాండిత్య్హము చమత్కృతి పెరుగుచున్నవి. అట్లే జడ్జీలు వకీళ్ళు మేజిస్త్రీటులు పోలీసులు పెరుగుచున్న కొద్దీ విచారణం తీర్పుల పటాటోపములు పెరుగుచున్నది. ముఖ్యముగా వకీళ్ల సంఖ్య పెరుగుచున్నకొద్దీ న్యాయాన్ని మాటు పుచ్చడానికి అన్యాయమును గెలిపించడానికి అవకాశాలు ఎక్కువగుచున్నవి.
     బ్రిటిషువారు ఇండియాలో కోర్టులు పెట్టకముందు నేరాలు జరుగ  లేదా, అంటే జరుగలేదని చెప్పజాలము. ఇప్పటి కంటే చాలా తక్కువగ జరుగుచుండేవనుట నిస్సంశయము, జరిగిన నేరాలను గ్రామాలలోని నగరాలలోని పెద్దలు యెల్లాగో ఒకలాగ ఫైసలు చేసి యిప్పటికంటె న్యాయమైన ధర్మం ప్రకారం పరిష్కరించేవారు. కేసులు వేగం పరిష్కారమయ్యేవి. విచారణకు దూరప్రదేశాలకు ఉభయ పార్టీలూ సాక్షులతో పరుగెత్తడం, వాయిదాలు వేయించు కుంటూ వుండడం జరిగేది కాదు.
   నేటి హైకోర్దు జడ్జీలు కాని వకీళ్లు కాని తమ వద్దకు వచ్చే పార్టెలతో పూర్వానుభవం లేనివారే. వారి సాక్షులతో అసలే పరిచయం లేనివారు. అందువల్ల వకీళ్ళ వద్దకు పార్టీలు కేసులు తీసుకొని వెళ్లడం. తమ వద్దకు వెళ్ళిన కేసులను తమ పార్టీలు విజయమున కనుకూలమగునట్లు వకీళ్ళు కేసులు నిర్మించి ప్లెయింటు సస్మాధానాలు జడ్జీల వద్ద దాఖలు చేయడం వారివారి పార్టీల సాక్షుల్ నందు కనుకూల మగురీతిని సాక్ష్యములెట్లు  చెప్పడమో పాఠాలు నేర్పడం, జడ్జీల వద్ద ఈ పాఠాలనొప్ప చెప్పించడం, ఆ జడ్జీలు తమ బుద్దిని ప్రయోగించి యే పార్టీ వాదం నిజమైనట్లు
   గరిమెళ్ళ వ్యాసాలు