పుట:Garimellavyasalu019809mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాశ్చాత్యార్ధిక శాస్త్ర మూలాధరసూత్రం వీరందరికీ వేద వాక్యతుల్యం, ప్రపంచంలో లేచిన చిత్రకళలు ఉత్తమ సంస్థలు అపూర్వ సామ్రాజ్యాలు అన్నీ దనాశ లేనందువల్ల పుట్టినవనీ, ధనాశా విజృంభణవల్ల నీల్గినవనీ వీరు మరచుచున్నారు.

     ధనాశ లేకుంటే కర్షకుడు నాగలి చేతపట్టని, కార్మికుడు సుత్తిముట్టని, గుమాస్తా కలముపట్టని శిల్పికి కుంచె కిట్టని, గాయకుడు రాగముతట్టని, దేశికున కాసక్తి పుట్టని దుర్ధశ దేశమునకు సంబవించినదంటే, కేంద్రకోణములలో ఎక్కడో ఒక కీటక మున్నదనియే అర్ధము. డెన్మార్కు, రాజ్య్హంలో ఏదో కుళ్లు వస్తువు ఉండబట్టే, అది పైకి అంత పటాటోపంగా కనిపించుతున్నా తక్షణ చికిత్సా ప్రాత్రమమనుటకు సాక్ష్యమగుచున్నది. జనులను, వర్తకులను, కర్షకులను, కార్మికులను, ఉద్యోగులను క్షుద్రతమ ధనాశా  భావముతో కాక దేశాభ్యుదయ మనే ఉత్తమ సంకల్పసిద్ధి కోసమే ఉత్సహంతో పనిచేయించే ఉపజ్ఞను పురిగొల్పజాలని రాజ్యాంగ విదానము సుప్రశస్తము కాదనుట నిక్కము
--ఢంకా, ఫిబ్రవరి, 1949