పుట:Garimellavyasalu019809mbp.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతిసులభముగ సామ్రాజ్య దేశాలకు వలస దేశములగును. అక్కడి విద్యాధికులును ప్రజలును దేశాభిమానము మొదలగు విషయములను గురించి ఉపన్యాసాలు కురిపించినా, వారి మనస్సుల నాందోళన పరచునది దేశ స్వాత్ంత్ర్య సమస్యను మించి తాము ధనాడ్యుల మెట్లగుట యనియే. అందుకే ఈ దేశాభిమనం తెరమరుగున వారి పదవీపారాయణ తాండవము, బ్లాక్ మార్కెట్ సేవా భోగం, కపట ప్రజాపరిపాలనా సిద్దాంత విన్యాసం, ఉపన్యాస తరంగిణీపై వర్తనం మొదలైన రంకులన్నీ గౌరవ్ నామదేయములతో సాదుగుచుండును.

   ఈ కళలలో ఆరితేరిన వారికే కీర్తి ఉద్యోగం ధనము లభించును గనుక జనులు ఇతర వృత్తిని దేనిని చేసినా ఈ మహాకళలో ఉప కళాభాగముగా మాత్రమే దానిని స్వీక్రించి స్వైర్విహార ధీరులగుచుందురు.
   ఏ మాత్రము సచ్చింతన, సదాశయమ, సన్మార్గ ప్రవృత్తి కలవాని కయినను ఈ రొంపి నంతటినీ చూస్తే గుండె లవిసిపొవును. కనుక నిజమైన యోగ్యులెవరైనా యెక్కడైనావుంటే ఈ మంత్రులు, నాయకులు, శాసనసభ్యులు, ఫణిగ్ఫుంగవులు, జడ్జీలు, లాయర్లు మొదలగువారు విహరించే మార్కెట్టు వీరిలో గాక ఎక్కడో గుట్టుగా వుంటారేమో!
  అట్టివారి మదులు ప్రజాదృష్టిలో  తాండవ మాడగల గీతలేదు. ప్రపంచమున్ కొక అధ్యాత్మిక మహాసంస్కారము ప్రాప్తించగల కాలములో మాత్రమే అట్టివారు ఒకరైనా కలరని సజ్జనులకుజ్ తెలియగలదు. వారు రంగములోనికి రాగలగడమే కష్టం. వారే నిజమైన విప్లవవాదులు. తక్కిన క్రాంతి విప్లవ అభ్య్హుదయాది నామధారులందరూ ఈ మహాకపట నాటకములో భాగములును భాగస్వామ్యర్ధ భైక్షకులును మాత్రమే.
  అట్టివారు రంగములోనికి వచ్చిరా? వీరందది పని కరక్కాయే కనుక వారెచ్చట అణగిమణగి యున్నాగాలించి వారి మీద దుష్పచారములు చేసి పరువు తీసి పరపతిని చెడగొట్టి తలయెత్త నీయనట్టు "కామన్ ఫ్రంటు" ను ప్రదర్శించడం పై వర్నలవారందరికీ యేకైక  సమానాశయం. దేశములో ఎవ్వరెవ్వరి స్వార్ధ పరాయణాభిలాషకును వారి ఆశయములు
గరిమెళ్ళ వ్యాసాలు