పుట:Garimellavyasalu019809mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దూబరా ఖర్చులు తగ్గి మితవ్యయపారీణులైతేనే కాని ప్రజలకు అపు పుట్టదు. పుట్టినా మరింత దండుగ చేటు. అప్పు అన్నది పుట్టితేనే కాని బతుకే దుర్బరం ఈ విధంగా విత్తుముందా చెట్టు ముందా అన్న ప్రశ్నవలె ఉన్నది గ్రామస్థుల సమస్య.

  అది ప్రపంచమంతటికీ కూడ ఐకమత్యతకు, పరస్పర సహకార్ముకు, కొక శ్రేయోబుద్ధికీ సమయము కాని దురాశలకు కుత్సితపు టెత్తులకు ఒంటేత్తు గునములకు కాలము కాదు వర్తకపు పోటీద్వారల కొన్ని దేశములు, సామ్రాజ్యపిపాస ద్వారా కొన్ని దేశములు ఇంతవరకు తమ సాధన సామగ్రినంతటిని జాగ్రత్త పెట్టుకొని ఏమరియున్నజారులను ఇష్టమువచ్చినట్లు పీడించియు దోచియు ఉన్నత నాగరీకతా సౌభాగ్యమునందు ఊగిసలాడగలిగినవి. కాని అన్యులకన్యాయము చేయుటవల్ల్ వచ్చేవైభోగము లెన్నటికైనా కూలక తప్పవు. వీరభట సామ్రాజ్య్హములు త్రక్కినవి చేసిన అన్యాయములకంటె వేయిరెట్లు ఘోరమైనవి గనుక అవి కూడా నిలువున నీరసించుచున్నవి. అయినను వానికి పూర్వ పిపాస పోక మాయలు మర్మములతో ప్రపంచము నింకను మోసము చేయుటకో అవి ప్రయత్నించు చున్నవి. ఇట్టి మోసములవల్ల మరి కొంచెము కాలము ఈడ్చుకొనగల వేమోకాని స్థిరములుకాగలవనుట కల్ల.
 ఈ సామ్రాజ్యములు వార్తకమును ఒక కళ గాను ధర్మముగాను నాగరీకతా చిహ్నముగాను నిర్మింపదలచినవి కాని వర్తకము నందున్న కళను ధర్మమ్ను నాగరీకతను గూడ తుత్తినియలు చేసినవి. ఘోరమయిన్ దురాశ అని చీరగట్టి సింగారించి వన్నెలాడివలె మెరపింపచేసినవి, తుచ్చమైన్ మోసమునకు అవి ధర్మమును తొడుగు తొడిగి ప్రతి సభయందును ప్రజ్ఞవలె ఫరిడవిల్లజెసినవి. అనంతమైన హింసకు అవి ఆదరణమిచ్చి చట్టముల ద్వారాను కోర్టుల ద్వారాను కట్టుదిట్టములు జేసినవి. ఇదంతా తెలిసియో, తెలియకయో బ్రహ్మదేవుని కెఱుక కాని, దీని నంతటినీ ఆధునిక నిజ్ఞానమని మాత్రము అని సౌద శిఖరములనుండి చాటుచున్నవి. పవిత్రమైన ఉపాధ్యాయ
 గరిమెళ్ళ వ్యాసాలు