పుట:Garimellavyasalu019809mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రణాళికలు (Plannings)

  గొప్పకార్యం తలపెట్టుకున్నప్పుడల్లా ముందు ఇండియా గవర్నమెంటు బడ్జెట్టు లాగ, ఒక ప్రణాళిక వుండవలసినదే. వ్యవసాయ వ్యాపారముల్కు కూడా ఇట్టి ప్రణాళికలుండాలి. వాటినే ప్లానింగులంటారు. రష్యా పంచవర్షప్రణాళికలను  ప్రారంభించినప్పటి నుంచీ, ప్రతీ దేశము వారూ ఇదే పని పట్టారు. జార్ల ప్రభుత్వములో రష్యాదేశము వ్యవసాయ వ్యాపారములు రెంటిలోను వెనుకబడి వుండి దేశమంతా ఊసరక్షేత్రమై ఫ్యాక్ట్రీలల్పసంఖ్యాకములై, గనులు పని చేసేవారి ఆస్కారము లేక జను లన్న వస్త్ర హీనులై, బలవంతులు బలహీనులగు కోటానుకోటి జనులను దోచుకుంటూ, విదేశములనుండి యెనలెని వస్తువుల్ను దిగుమతి చేసుకుంటూ అంగరంగ వైభవములనుభవిస్తూ ఒక విదమగు సైనిక ప్రభుత్వమును చలాయిస్తూ వుండేవారు. ఈ ఉప్పెనలోనుంచి తప్పుకుంటకు రష్యా  సదరు ప్రభుత్వమును నిర్మూలంచేసి  కార్మిక ప్రబుత్వం పెట్టుకొని తమ దేశమునకు తమ స్వత్ంత్ర రాష్ట్ర సమ్మేళనమునకు కావలస్దిన సరుకును తామే నిర్మాణము చేసుకొనుటకు, అందరికీ పని కల్పించడానికి విద్యా వివేకములు పెంచడానికీ. ఆరోగ్యభివృద్ది ఛెయడానికి, కమ్యూనిష్టు పార్టీ వారిపై అభిమానమును హెచ్చించడానికి, రోడ్డులూ, రైళ్ళూ పెంచి పరస్పరస్నెహ బాందవ్యములుదయింప చేయడానికి, ప్రణాళిక మీద ప్రణాలీఖా వేసుకొని సాగించవలసి వచ్చింది. సాగించింది సాగిస్తూ వుంది.
   తక్కిన దేశాలకి రష్యా చేస్తున్న ఇతర ప్రయత్నములు నచ్చినా నచ్చకపోయినా ఆర్ధిక ప్రయత్నములు మాత్రము వచ్చుచున్నవి. ధరల మాంద్యం, నిరుద్యోగం, వ్యాపార స్తంభనము అనే వాగుల నుండి తప్పించుగుంటకు ఏవో కొన్ని ఉపాయములు పన్నుకోక తప్పుతున్నది కాదు. బ్రిటిషు వారు  ప్రారంభించిన టారిఫు గోడలు, అటావా ఒడంబడికలు, జపానుతో సంప్రదింపులు, ఒక రీతిగా ఈ జాతిలోనివే. రష్యా అంటే తన దారిద్యకర్మము కొద్దీ తన మార్గము త్రొక్కింది. ప్రపంచంలో ఇతరత్రా కూడా యంత్రాలయములు వెలసి యెగుమతులే ప్రారంభించడం వల్ల బ్రిటిషు
గరిమెళ్ళ వ్యాసాలు