బట్టియే ఆంధ్రులకు హక్కులు గలవని తేటపడుచున్నది. గత మద్రాసు నగరసచరిత్రను చూసినా ఇప్పుడందులో గల ఆంధ్రసంస్థల ప్రాబల్యమును చూచినా, నగరాభివృద్ధికి ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయ మెంత పోషకమైనదో పరిశీలించినా, ఆంధ్రులకా నగరంపై హక్కులు లేవని వాదించగల మూర్ఖులుండబోరు.
అయితే, పట్టాభి గారి పదజాలమునకు అర్థము "సర్వ హక్కులు ఆంధ్రులకే" అను వాదమును వర్జింపవలెనని మాత్రమే అగుచున్నది. ఈ సూత్రం ఒక్క ఆంధ్రుల పట్లనే గాక తమిళులు, కన్నడులు, మళయాళీలు మొదలగు ఇతర వర్గాల వారి పట్ల గూడ వర్తించవలెను. మద్రాసు నగరాభివృద్ధియు, తత్పలమును కేవలం అరవల దొక్కరిది మాత్రమేయై యుండవలెననిన్నీ, అది అరవ రాష్ట్రమునకు మాత్రమే రాజధాని కావలెనన్ని అరవలు విపరీత వాదం చేస్తున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక పాఠమును నేర్పవలసింది ఆంధ్రులు మొదలగు వారికి కాక కేవలం అరవలకు మాత్రమే.
మద్రాసును మిశ్రమ భాషా రాష్ట్రంగా మార్చి తీరాలి. అయినా ఇది పూర్వపు గ్రీకు సిటీ స్టేటుల యుగం కాదు. ఒక్క నగరమెప్పుడూ ఒక రాష్ట్రమై స్వయం సమృద్ధం కాజాలదు. మద్రాసు చుట్టూ అనేక తెలుగు అరవ మిశ్రమ ప్రాంతాలున్నవి. చెంగల్పట్టు జిల్లా మొదలగు ప్రాంతాలనన్నిటినీ చేర్చి ఒక రాష్ట్రముగా చేయవలెను.
శాస్త్రిగారి విపరీతవాదం
శ్రీ టి. ఆర్. వెంకటరామశాస్త్రిగారి వంటి నిదాన పురుషుడు భాషాప్రయుక్త రాష్ట్రములు లోగడ యెన్నడూ అవసరం లేకుండెనని, కనుక ఇప్పుడునూ అవసరం లేదని చెప్పినట్లు జూలై 11 వ తేదీ ఇండియన్ ఎక్సుప్రెస్‌లో ప్రకటించబడింది. ఆనాటి రాజుల పాలకుల సత్సంస్కృతిపరిశోభిత విశాలభావపాలనలో అట్టి అవసరం లేకుండెనని నేనును ఈ వ్యాసంలో చెప్పితిని. కాని బ్రిటిషువాని మూలంగా ప్రవేశించిన పరభాషా ద్వేషతత్వం నేటికిని మద్రాసు నగరంలోను, ఉత్కళ, గంజాం మండలములోను, విజృంభించు
గరిమెళ్ళ వ్యాసాలు
135