వుంచడం చాలా అవసరం.
మునుపటి రాజుల కళాపోషణ భాషాపోషణా యుగంలో లాగా, ఇప్పటి సంకుచిత భాషావాద డెమోక్రసీ నాయకులు తమ రాష్ట్రములో తమ భాషకు తమ సంగీతానికి, తమ "సంస్కృతికే" తప్ప ఇతర విధానాలకు దోహదమిస్తారేమో చెప్పజాలము. అట్లు ఇయ్యనన్నాళ్లు భారతీయ సంస్కృతికి ద్రోహం చేసిన వారే అవుతారు. నాయకులెట్లు వర్తించినా వివేకధురీణులగు పండితులు పామరులైనా తెలివిగా వర్తించి తమ సనాతన సంప్రదాయమును మరువక తమ భాషను, సంగీతమును కళలను ఉద్ధరించుకోవడంతో బాటు ఇతర భాషలో సంగీతంలో నాట్యంలో నాటక విధానాలలో కవితా ధోరణులలో యెట్టి ఫక్కీలు సాగుచున్నవో గమనించి అవగాహన చేసుకొని తమ ప్రాంతములలో వాటిని ప్రచారం చేయబూనినారా, అది నిజమైన భారతీయ సంస్కృతికి దోహదమవుతుంది. లేకుంటే కూపస్థ మండూకమై చలనం లేక గడ్డ కట్టిపోతుంది.
ఇట్టి అవస్థ రాకుండా తప్పించడానికి మిశ్రమ భాషా రాష్త్ర నిర్మాణం అత్యంతావశ్యకం. సరిహద్దు ప్రాంతాలలో అట్టి రాష్ట్రాలను నిర్మించడం సులభం, అవసరం, అభ్యుదయ దోహదకరం. సంకుచిత భాషావాదుల మూఢత్వము నరికట్టగలవి అట్టి మిశ్రమ రాష్ట్రాలే.
ఈ విషయమును నేను కొత్తగా ప్రతిపాదించలేదు. కొంత కాలం క్రిందట Andhra Herald లో (Bylingual provinces are the connective links of Indian Culture) అను వ్యాసమును ఆంగ్ల భాషలో వ్రాసితిని. ఆ భావముల నింకోరీతిని ఉటంకించవలసిన అవసరం యేర్పడినది కనుక ఈ వ్యాసమును వ్రాయుచున్నాను.
మద్రాసు మిశ్రమ రాష్ట్రం
ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు మద్రాసు నగర సమస్య ప్రధానమగు చిక్కుగా భావించబడుచున్నది గనుక, ఈ విషయమును తిరిగీ ఉద్ఘాటించవలసి వచ్చింది. శ్రీ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రులు మద్రాసు నగరంపై "తమకు గల హక్కులను" వర్జింపలెనని కోరినారు. ఆ పదజాలమును
134
గరిమెళ్ళ వ్యాసాలు