పుట:Garimellavyasalu019809mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాషాప్రయుక్త రాష్ట్రాల గోలకు కారణం

   ఇందుమూలంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలోయను గోల బయలుదేరింది. సహజంగా కూడా యేదో మిశ్రమ భాషా ప్రాంతాలలో తప్ప తక్కిన భాగాలలో రాష్ట్రముల పాలన ఆ భాషలో జరగడం విపరీతం కాదు. ఉత్తరాది రష్ట్రము లనెకములా విధముగానే నడుచుచున్నవి. కనుక ఆంధ్రులు మహారాష్ట్రులు ఉత్కళులు కన్నడులు మొదలగువారు భాషాప్రయుక్త రాష్ట్రాలను కోరడంలో విపరీతం లెదు. ఏ రాష్ట్ర పాలన ఆ రాష్త్రభాషలో ప్రజల కవగాహమగు రీతిని జరగ్డం విపరీతం గాదు. బ్రిటిషువారి హయాములో గనుక దేశానికంతటికి ఒకే భాష రాజకీయ భాష కావడం, సకల రాష్ట్రాల పాలన ఆ భాష (ఇంగ్లీషు) లోనే జరగడం, అందుకోసం విద్యావిధానం తారుమారై ఉద్యోగసేకరణ సాధనముగా మాత్రం మారడం తటస్థించింది కాని, ఇంకే యుగంలోనూ యెవడో క్రొత్త మగడుగా వచ్చిన వాని భాష రాజకీయ భాష య్యే విపరీతం జరగలేదు సరేగదా, ఆ క్రొత్త మగడే నూతన రాష్ట్ర భాషా పుత్రుడుగా పోషకుడుగా పరిగణీంచేవాడు.
    నేడు బ్రితిషు హయాము వెళ్లి ఇండియన్ రిపబ్లికన్ యహాము వచ్చింది కనుక, యేవో అఖిల భారతీయ పరిపాలనా కార్యాలు హిందీలోనో ఇంగ్లీషులోనో జరిగినా, ఇతర సమాన్య వ్వవహారాలు దేశీయ భాషలలో జరుగవలసిందే. అట్లు జరుగకుండ ఆ కార్యాలను ఇప్పటి వలె ఇంగ్లీషులోనే జరిగీచడమనేది డెమోక్రసీ సూత్రాలకే విరుద్ధము. అది పైపైని యెన్ని యెలక్షన్లు శాసన సభలు, చర్చలు మొదలైన రూపాలతో కనిపించుతున్నా కృత్రిమ డేమోక్రసీ కాని నిజమైన డెమోక్రసీ అనిపించుకోదు.
మిశ్రమ ప్రాంతాలలో మిశ్రమ  భాషా రాష్ట్రాలు
   చిక్కల్లా మిశ్రమ భాషాప్రాంతాలపట్లనే వస్తున్నది. ఆప్రాంతా లను తమ రాష్ట్రాలలో చేర్చాలని దరిరాష్ట్రాల నాయకులందరూ ఘోరాతిఘోరవాదనలు చేస్తూ లేకుంటే రక్తప్రవాహాలు కార్పిస్తామని బెదిరిస్తున్నారు. నూటికి ఎనభైమంది ఆ ప్రాంతంలో యేభాషము చెందితే ఆప్రాంతాల్ని ఆ దరి రాష్ట్రంలో చేర్చవచ్చును లేని ప్రాంతాలను మిశ్వమ రాష్ట్రాలుగా 
గరిమెళ్ళ వ్యాసాలు