Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలెగ్జాండరు దండయాత్ర తదనంతర చరిత్రల ఫలమనడానికి సందేహం లేదు.

అట్లే బౌద్ధులు మొదలగు ధర్మ మత ప్రచారసక్తులు భారతదేశం నుంచి చీనా, బర్మా, సింహళం, జావా మొదలగు ప్రాంతాలకు వెళ్ళి అచ్చటి ప్రజల అభిమానాలను జూఱగొని వారికి భారతీయ సంస్కృతి పరిచయము నొనర్చిరి. నాటినుండి ఆయా దేశాల విద్వాంసులను భారతీయ ప్రతిభను కనులార చూడగోరి విచ్చేసి సత్కారమును పొందేవారు. జాతులకు జాతులకు మధ్య సంస్కృతులలో యేవో బ్రహాండ భేదములున్నవను మాట కల్ల. చీనాలోని కన్ఫ్యూసియస్ సిద్ధాంతములకును బౌద్ధ సిద్ధాంతములకును యెంతో సన్నిహితమగు పోలికలుండబట్టే, చీనా మొదలగు దేశాల ప్రజలు సునాయాసంగా బౌద్ధమతంలో చేరడం సంభవించింది కాని, నిర్భంధం, పేరాసల వల్ల కాదు.

తరువాత హిందూ వేదాంత తత్వప్రచారకులు తమ కళా నైపుణీ చాతుర్యముతో రామాయణ మహాభారతాది సాహిత్య చోదిత సౌందర్య ప్రసారముతో ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు, బౌద్ధమత సిద్ధాంతాలను వలె భారతీయ కళలను కూడా వారు సులువుగా అవలంబించారు. మన దేశంలో చిత్రాలలాటి చిత్రాలే, దేవళములలాటి దేవళాలే, సాహిత్యం లాటి సాహిత్యాలే ఆ దేశాలలో వెలసి నేటికి ఉదాహఱణగా నిలచి ఉనవంటే మన పూర్వులు వాటిని వారిపై నిర్బందించిరని అర్థం కాదు. ఆయా దేశాల ప్రజల లక్షణాలును ఈ దేశ ప్రజల లక్షణాలును ఇంచుమించు ఒకే పోలిక కలవగుటవల్లనే అట్టి కళాసమ్మేళనములును జరిగినవి.

మత ప్రచారాలు, ద్వేష ప్రబోధాలు

ధర్మిలాను మనదేశంలో అనేకులు మహమ్మదీయ, క్రైస్తవ మతములలో చేరిన సందర్భములను కూడా మనమాలోచించ వచ్చును. ఈ మతాల ప్రచారం నాటికి మతప్రచారమనేది ఒక మోస్తరు పిచ్చి ఆవేశం క్రిందికి మారింది. మహమ్మదీయులు కాని వారినందరిని వారు కాఫర్లనీ, వారికి మోక్షం లేదని, బలవంతంగానైనా చేర్చుకొవడం దోషం కాదనీ భావించారు. కనుక అనేకులు నిర్బంధంగానే ఆ మతంలో చేరారు. అట్లే క్రైస్తవులు కానివారినందరిని

గరిమెళ్ళ వ్యాసాలు

129