పుట:Garimellavyasalu019809mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్ని బహుభాషాప్రయుక్త రాష్ట్రాల

అత్యావశ్యకత

 ప్రస్తుతం కొన్ని ప్రాంతముల ప్రజలు ధోరణులు చూస్తే భాషాప్రయుక్త రాష్ట్రాలు భారతీయ సంకృతికి ద్రోహములవుతాయా, ద్రోహదములవు తాయా అన్న సందేహం కలుగుతుంది. ఒక భాషవానికి ఇంకొక భాషన్నా ఆ భాష మాట్లాడే వ్యక్తి అన్నా ఆవ్యక్తి శ్రేయస్సన్నా పరమకంటకంలాగా కనిపించే స్థితి వచ్చింది. ఇది కేవలం ప్రజలలో గల లోపమేయైతే ప్రభుత్వమ సంస్కరించవచ్చును. కాని ఆ ప్రాంత్రాల ప్రభుత్వాలకే ఇట్టి సంకటము తగులు కున్నట్లు కనిపించుచున్నది. ఇట్టి సంకట పీడితుల పీడకు తాళలేని నా మిత్రుడొకడీ మధ్య (బరంపురం వాసి) దేశాన్ని లేటిట్యూడు లాంగిట్యూడుల సరిహద్దుల ప్రకారము తప్ప వేరొక రీతిని రాష్ట్రాలుగా విభజించరాదనే స్థితికి వచ్చితినని అన్నాడు.
  ఈ చిక్కులు ముఖ్యంగా ద్విభాషా, బహుభాషా ప్రాంతాలలో మరీ యెక్కువగా కలుగుచున్నది. స్వతహాగా చూస్తే ఇది స్వభాషాభి మానం వల్లను, పరభాషా ద్వేషం వల్లను కలిగిన సంకటంకారు. భూమిని దేశాలుగానో, రాష్ట్రాలుగానో విభజించడానికి భౌగొళిక, నైసర్గిక, సముద్ర, పర్వత, నదీ, తటాకాదులగు సరిహద్దులైన ఉండవచ్చును గాని ప్రజలను ప్రాంతాలను బట్టి సరిహద్దులు వేసి, జాతులుగా నిర్ణయించడానికి మార్గాలు లేవు. ఎట్టి భౌతికపు టాటంకముల నైనా ప్రజలు తమ తమ అవసరాలను బట్టి అతిక్రమించి ఒకరితో ఒకరు కలుస్తూ సంభాషిస్తూ వ్యవహరిస్తూ ఆనందిస్తూ వుంటారు. కంజుక ఒక తెగకూ ఇంకొక తెగకూ హద్దు నిర్ణయించ సాధ్యంకాదు. ప్రధాన మధ్యస్థ ప్రాంతాలలో ఫలనా తెగ ఫలానా సంఘం అని హద్దు చెప్పడానికి వీలున్నా, ఎక్కడో ఒక చోట త్రివేణీ, ద్వివేణీ, చతుర్వేణీ సంగమాదులలాక బహువర్గ బహుభాషామిశ్రమ ప్రాంతాలు ఉండక పోవు. మానవులలో పరస్పర సంపర్క సంపర్క వాంఛ చచ్చినవాడు తప్ప  కలగాపులగం ప్రాంతాలు లేకుండా ఉండేటట్లు సాధించడం సాధ్యం కాదు.
   సృష్టి వున్ననాళ్ళు మానవకోటిలో అట్టి పరస్పర సంపర్కవాంచ
 గరిమెళ్ళ వ్యాసాలు