పుట:Garimellavyasalu019809mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన ఆశయమును త్రోసిరాజు చేయుచున్నారు. రాష్ట్రములన్నీ కలసి వుంటేనే దక్షిణ ఇండియా, లేక మదరాసు రాజధానీ ప్ర్రభుత్వ మంతయు స్వయం సమర్ధకముగా ఉండును కాని వానిని వేరుపరచుచో ప్రత్రిరాష్ట్రమున్ స్వయం సమర్ధము కాక చేతిసొమ్ము తగులుకొనునని కొందరు వాదించుచున్నారు. ఇది కొన్ని భాగముల పట్ల నిజమగునెమో కాని ఆంధ్ర రాష్ట్ర సమస్య నాలోచించి నంతమేరకు సత్యము కాదని రూఢిగా చెప్పవచ్చును. సింధు, ఒరిస్సా, సరిహద్దు రాష్ట్రముల వలె గాక స్వయం సమర్దక మైనదని8 లెక్కలు స్పష్టపరచుచునే యున్నవిగదా? ఏ చిన్నభూభాగమో, ఏ అల్పసంఖ్యాకజనులో, వీరికొరకై ప్రత్యేకత యెందుకనువాదమిక్కడ పొసగదు గదా! మూడు కోట్లను మించిన జన సంఖ్యయు 18 మండలములును గల ఆంధ్రావనిపైని ఈ నెరమును మోపతగదు గదా ఇట్లు వేరు చేయుటవలన ఇతర భాగములకైనను విశేషంష్టము కలుగదు సరేగదా న్యాయమైన లాభములేవియో జరుగుచునే ఉండును. ఏది యెట్లున్నను నాలుగు భాషలును బ్రిటిషు ఇండియాలో సగము భూభాగమును గల దక్షిణ ఇండియా నంతటిని ఒకేరాష్ట్ర ప్రభుత్వములో కుక్కి ఈ విదానము నిప్పటివలెణే కొనసాగించవలెనని సలహా యిచ్చుటలో అర్ధము లేదు. ఈ నాలుగింటిలోను అధికతర జనసంఖ్యయు, జిల్లాలును గల ఆంధ్ర భాగమునైనను ముందుగజ విడదీసి వరి పరిపాలనమును వారికిప్ప గింఛుట ప్రప్రధమ కర్తవ్యము.

    ఈ పని యింతకుముందెన్నో సంవత్సరముల క్రిందటనే జరుగవలసియుండెను. ఈ ఆందోళన ప్రారంభమై ఇరవై సంవత్సరములు దాటినది. దీనికి యేడు వెనకల ప్రారంభమైన అందోళనలెన్నో కార్యరూపమును దాల్చినవి. జస్టీసు పార్టీవారి అసడ్డయు, కాంగ్రెసు పార్టీవరి అన్యకర్యనిమగ్నతయే దీని నిన్నేళ్లు ఆలస్యము చేసినవి. ఈ కాలములోనె మన భేదములను విస్తరింపజెయుటకును, పరస్పరస్పర్దలు పుట్టించుటకును అనెక ప్రయత్నములు జరిగినవి. అయినను ఆంధ్రరాష్ట్ర నిర్మాణము దైవ నిర్ణయము. ఇట్టి పస్పర స్పర్ధలు చిరకలము నిలువజాలవు. నవ్య్హతరమగు  ఆందోళన స్కల భాగములయందును ఏక ముహూర్తమున ప్రారంబమైనది. ఈ బీజమున్ మొట్టమొదట నాటిన శ్రీ పట్టాభి సీతారామయ్యగారు తిరిగి అనుమానమైన ఆందోళనమును లేవనెత్తి దీనిని సాధించుటకై కంకణము
గరిమెళ్ళ వ్యాసాలు