పుట:Garimellavyasalu019809mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మించి కూడా మనలోమనమే స్పర్ధలు వీడి దీనికెందుకు ప్రాతికూల్యమును ప్తకటించవలెనో మరీ అర్ధం కాకున్నది.

అర్ధములేని ఆక్షేపణలు
  ఆంధ్ర రాష్ట్ర సమస్య కంటె మద్రాసు ప్రబుత్వ సమస్య చాలా ప్రధానమైనదియు, ఈ నూతన ప్రభుత్వ ప్రారంభావస్థలో దీనిని పైకి యెత్తియే ఆ ప్రధాన సమస్యకు ఆటంకము వచ్చుననియు మనకు కొన్ని పాతబోధలు కూడా వినబడుచున్నవి.  ఈ రాష్ట్రీయ, రాజదానీయ, అఖిలబారత జాతీయ సమస్యలలో ఒక దానికి ప్రాదాన్యమును, ఇంకొకదానికి ప్రాధాన్యమును కాని, ఒక దానికి ప్రధమప్రాధాన్యము, ఇంకొకదానికి ద్వితీయ లేక తృతీయ ప్రాధాన్యమును కాని యిచ్చుటకు వీలులేదు. అన్నిటిని సమాన ప్రాదాన్యము నిచ్చినపుడీ సవ్యమగు పరిష్కారముల్ చిక్కగలదు కాని, ఇటువంటి భేద దృష్టి వలన లాభము చిక్కబొదు. ఈ భేదదృష్టి కేవలం కాలయాపనకు నెపమును, వేరు భావములకు అకరమును అగుచున్నదనుటకు సందేహం లేదు. ఇట్టి దృష్టి వల్లనె జస్టీసు, ఇండిపెండెంటు మంత్రివర్గములు ఈ సమస్యను దిగద్రొక్కి యధారీతిని కాలక్షేపము చేసుకొనగలిగినవి. కాంగ్రెసు మంత్రివర్గమునకు, అందులో ముఖ్యముగ మన ఆంధ్ర శాఖకు కూడా ఇటువంటి దృష్టి లేదని మనము అనుకోవలెను. కాలయాపనమున కగు నెపములను విడచి కార్యకరణమునకు దిగునప్పుడే యే మంత్రివర్గమైనను రాణించగలదు. క్రొత్త పంధాలకు దిగుటకై సంకోచించుచు తమకు చేజిక్కిన పదవుల నేవో యేకరీతిని నిలబెట్టుకొనుటకై తంటాలు పడుచుండుటవలనే గదా జస్టీసు ప్రభుత్వము నిర్వీర్యమై అఖాతములో మునిగిపోయినది! అట్టి రాజనీతిని తిరస్కరించియే కద కాంగ్రెసు మంత్రివర్గము ఎన్నియో నూతన సంస్కరణములకు గడంగుచున్నది! ఏనిలో యే సంస్కరణముకన్న ఈ సంస్కరణము తక్కువ ప్రధానమైనది? దీనికి కలిగే ఆటంకము లేమి?
   ప్రారంభించిన నూతన సంస్కరణములకే చాలా సొమ్ము వ్యయమగుచుండగా, వానికి ఈ సంస్కరణమును కూడా చేర్చి ఆవ్యయ భారమును మరింత యెక్కువ చేయవలె నెందుకని కొందరు మహాశయులు ప్రశ్నించి 
 గరిమెళ్ళ వ్యాసాలు