పుట:Garimellavyasalu019809mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాత్కాలికముగా దాని వ్యవహార నీతి మారుచుండు గాక, కాంగ్రెసు అంతమాత్రమున ఒక రాజకీయ పార్టీయై ప్రభుత్వములో పాల్గొని దానిని దిద్దిబూనుచున్నదని చెప్పజాలము. అది ఒక రాజకీయ పక్షము కాగానే దాని సార్వజనీన తత్వము క్షీణించి సకల ప్రతినిధి కాకఫొవును. చాలా కాలము వరకు భారతదేశపు కాంగ్రెస్సు అట్టి సర్వజన ప్రాతినిద్యముగౌరవమును గోలుపోలేదు.

     1921 లో గాంధీజీ కాంగ్రెస్సు నాయకత్వమును వహించుటకు ముందుకూడా కాంగ్రెస్సు, సంస్థారూపకముగా పభుత్వముతో నెట్టి సంబంధమును పెట్టుకొకుండానే, అనేక వీరపోరాటములను జరిపినది. అనంతజ్ఞాన పౌరుషములను రదీపించినది అయినా ఆ రోజులలో ప్రజాసామాన్యానికి కాక విద్యాదికుల్కు కూడా ప్రభుత్వ మంటే ఒక గుండెభయం ఉండేది. ప్రభుత్వం కూడా నిర్విచక్షణంగా ప్రదాన పురుషుల నందరినీ ఘోర శిక్షల పాలుచేసి, ప్రజలలో భీతిని పుట్టిస్తూ ఉండేది. ఎవరో మహావీరులు తప్ప కాంగ్రెసి మాట్ రాజకీయాల మాట తలపెట్టేవరు కారు. అట్టి మహాకొద్దిమంది వీరుల త్యాగాల మూలముననె దేశమేమైనా ముందంజవేసేది లేకుంటే  అక్కుంక్కున్ భయపడి సాధారణ క్రిమికీటక జీవమును జరిపేది.
    కానీ గాంధీ మహాత్ముని ప్రవేశముతో కాంగ్రెస్సు మూలకంగా దేశానికంతటికి ఒక నవచైతన్యము కలిగినది. ఎవరో కొందరు మహావీరులు మాత్రమే కాక సామాన్య జనులు కూడా రాజకీయ ప్రసంగములు చేయడం, జెండా ఉత్సవములు జరుపుట ప్రభుత్వ ప్రతిఘటన చర్యలలో పాల్గొనుట, శిక్షలకు వెఱువకుడటమే కాక వానిని వలచుట మొదలైన కార్యక్రమం ప్రారంభమైనది అంతకు ముందు కాంగ్రెస్సు కేవలం తత్వంలో మాత్రమే సార్వజనీన సంస్ధ గా వుండేది కాని, నాటి నుండి కొంత్ కాలము వరకు ప్రత్యక్ష సార్వజనీన సంస్ధగా కూడా వెలిగినది.
   విజ్ఞానములో, ప్రతిఘటనా పరాయణత్వములో గాంధీ కాంగ్రెస్సు మునుపటి కాంగ్రెస్సు కంటే యెక్కువ విశాలమైనను, సభ్యత్వము కొందరికి మాత్రమే అంగీకరింపబడినందువల్ల ప్రత్యక్షముగా సార్వజెనీన వ్యవస్థకాకపోయినది. నాలుగణాలు రుసుము చెల్లించని వారలందరూ కాంగ్రెస్సు సభ్యత్వమును
గరిమెళ్ళ వ్యాసాలు