పుట:Garimellavyasalu019809mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాంధీ కాంగ్రెసు యుగమునకుద్యాపన

 సమస్త స్వతంత్ర ప్రపంచదేశాలలొను కాంగ్రెస్సు అనేది సార్వజనీన సంస్థ రాజకీయ ప్రణాళికలను పరిశీలిస్తూ, ఆమోదిస్తూ, వర్వాధ్యక్షుని యెన్నుకుంటూ అది దూరమునుండి పనిచేయునే కాని, ఏపార్టీతోను లీనముకాదు. అయినా అధికార్ములో ఉన్న పార్టీ దాని ఆమొదము ప్రకారము తప్పు పని చేయడానిక్ వీలులేదు. ఈ లక్ష్యమే వివిధ దేశములలొ వివిధ రూపములుగా సాధించబదుచున్నది.
   పరాధీన దేశములలో కూడా కాంగ్రెస్సు సార్వజనీన సంస్థయే అది ఈ స్వాతంత్ర్య సిద్ధి నొక్కటినే లక్ష్యముగా పెట్టుకొని ప్రజాపభోదము చేయుచు పోరాడుచుందును.  కాంగ్రెసు అధ్యక్షుని తప్ప పరిపాలనాధ్యక్షుని యెన్నుకొనుటకు దానికి పరబ్రభుత్వము అవకాశమియ్యది. అట్టి అవకాసము కొరకును, ప్రభుత్వ ప్రణాళిక లెల్ల తన ఆమోదము కొరకును, ప్రభుత్వ ప్రణాళికలెల్ల తన ఆమోదము లేనిదే సాగనీయకుండుటకును అది సర్వదా ప్రయత్నించుచుండును.
    భారతదేశపు కాంగ్రెస్సు ఈ దేశము పరాధీన స్థితియందున్నప్పుడు జనించినది. ప్రజలలోని జ్ఞానమును పౌరుష శక్తిని ప్రభోదించుటయే దాని లక్ష్యముగా ఉండెను. కాంగ్రెస్సు నాయకులు కొందరు శాసన సభ్యులగానో ప్రభుత్వోద్యోగు లుగానో పనిచేసినను, కాంగ్రెసు హోదాతొ గాక తమ వ్యక్తి బాధ్యత మీద్ అట్లు వర్తిస్తూ కాంగ్రెస్సు లక్ష్యములు సార్ధమౌలగుటకై ఇతర పార్టీలవారితో సహకరించుచు పోరాడుచు ఉండేవారు. వారికి ప్రజలతో గల ఆదరమునకు కారణము వారికి గల ప్రభుత్వ సభలలోని పదవుల వల్ల కాక, కాంగ్రెస్సు లక్ష్యముల కోసం పోరాడే ఘనతను బట్టి నిర్ణయించుబడేది.
   కాంగ్రెస్సు ఒక రాజకీయపార్టీ అయితే దాని కట్టి ఉత్తమ గౌరవము దక్కదు. ఒక రాజకీయపార్టీలో దేశస్దు లెల్లరును ఎన్నడును సబ్యులు కాజాలరు. ఒక్క కాంగ్రెస్సులో మాత్రమే సర్వులును సభ్యులగుటకు సంపూర్ణావకాశ ముండును. కాంగ్రెస్సు నాయకుల బలాబలములను బట్టి