Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలాపించవలసి వచ్చినది. జస్టిసు వర్గము వారికిది త్యాగరాజుల వారి నుండియే అలవాటైయుండుట చేతను ఇదివరకు తాము కొరుకుకొనుచున్న ఉద్యోగము కండల మీదికి మారుపేరులు పెట్టుకొని పీకు కొనుటకై వచ్చుచున్న ఈ పగటి వేషగాండ్రను చూడగానే మఱియును యెదరి యెక్కువ గట్టిగా ఆ పాటలను పాడఁదొడగిరి.

ఇట్లు యెల్ల పక్షములను నెదిరిపక్షమును దూషించుచు, తమ పక్షమును కీర్తించుచు ఎక్కడ యేలాగున వీలయితే అక్కడ ఆలాగున వోటులను కాకులవలె తన్నుకొని పోవుచుండుటయే వోటుల ప్రచారమై, దేశీయుల శాంతపరిశుద్ధ జీవనములెల్ల కుచ్చిత రణరంగములుగా మారిపోయినవి. వాటినుండి మన చిత్తవృత్తులను మరలించుకొని, ప్రజలకు సత్యమును చూపించగల నిగ్రహశక్తికి మనము సమకొననిదే మన జాతీయాభివృద్ధి ప్రారంభముకాదు. ప్రస్తుతము దేశమందుకు సంసిద్ధముగ లేదు - జాతీయ నాయకులెల్లరును శాసన సభలను ముట్టడించి వాటి ద్వారా యేవో యొకటి సాధింతుమని గోరుచున్నారు. వారు యేదో యొక పక్షమున వోటర్లకు వోటు నీయక తీరదు. ఆ వోటు కాంగ్రెసు కేండిడేటున కీయవలెననుటకన్న సదుపదేశము నెవ్వరును చేయజాలరు. విశాల ఆశయములతోను, స్వేచ్ఛాపరత్వము నందును, ప్రభుత్వ ప్రతిఘటన ధాటియందును, అచంచల విశ్వాసమునందును కాంగ్రెసు పార్టీ తక్కిన సముచిత జస్టిసుపార్టీనాయకులకంటె నెక్కువ యున్నతమైన స్థానము నాక్రమించుకొనుట కభ్యంతరమున్నదా?


-కృష్ణాపత్రిక, 25-9-1926

94

గరిమెళ్ళ వ్యాసాలు